DK Shivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రాజెక్టును కొనసాగించడానికి భయపడ్డాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వంలో దుమారాన్ని రేపుతున్నాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యుడు, కర్ణాటక ప్రజలకు ఆరాధకుడు అయిన కెంపెగౌడ-1 జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీని ఉద్దేశించి శివకుమార్ మాట్లాడుతూ, సొరంగాలు మరియు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం తనకు చాలా అభ్యర్థనలు అందుతున్నాయని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులను అమలు చేయడంతో ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. 2017లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా.. బెంగళూర్ నగరాభివృద్ధి మంత్రిగా ఉన్న కేజే జార్జ్ నగరంలో ఓ స్టీల్ ఫ్లై ఓవర్ కు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న నిరసనలకు భయపడ్డారని వ్యాఖ్యానించారు. అదే నేనైతే నిరసనలకు లొంగిపోయే వాడిని కాదని.. ప్రాజెక్టు పూర్తి చేసేవాడినని అన్నారు.
Read Also: Minister Jogi Ramesh: పేదల పక్షాన నిలిచే సీఎం జగన్ జోలికి వస్తే.. పెత్తాందార్ల సంగతి తేలుస్తాం..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా ఆశించారు. చాలా రోజులు అధిష్టానం చర్చల తర్వాత సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి, శివకుమార్ కు డిఫ్యూటీ సీఎంగా పదవులను ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి మధ్య పొసగడం లేదంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం కొన్ని రోజుల్లో కుమ్ములాటల్లో కూలిపోతుందని జోక్యం చెబుతున్నారు బీజేపీ నాయకులు.
సిద్ధరామయ్యపై డీకే శివకుమార్ వ్యాఖ్యలపై మంత్రి ప్రియాంక్ ఖర్గేని ప్రశ్నించగా.. ‘‘సిద్ధరామయ్య భయపడిపోయారని నేను చెప్పను. ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయానికి సున్నితంగా ఉంటారు. కొన్నిసార్లు తప్పుడు కథనాలు వెలువడి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఉపముఖ్యమంత్రి ఉద్దేశ్యం ఇదే’’ ఆయన వెల్లడించారు.