Titan tragedy: టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో 1912లో ముగినిపోయిన 1500 మంది మరణాలకు కారణమైన టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ ‘కాటస్ట్రోఫిక్ ఇంప్లోషన్’ అనే దృగ్విషయం కారణంగా పేలిపోయింది. టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు క్షణకాలంలో పేలుడులో మరణించారని యూఎస్ నేవీ ప్రకటించింది. గత ఆదివారం టైటాన్, టైటానిక్ శిథిలాలను చూసేందుకు ఐదుగురితో సముద్రంలోనికి వెళ్లింది. దాదాపుగా 1.45 నిమిషాల ప్రయాణం తర్వాత దాని నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. ఆ సమయంలో సముద్రం నుంచి పేలుడు శబ్ధాలను యూఎస్ కోస్ట్ గార్డు గుర్తించింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత టైటాన్ శిథిలాలను టైటానిక్ ఓడ సమీపంలో కనుగొన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని రూమర్స్ టైటాన్ చుట్టు తిరుగుతున్నాయి. టైటానిక్ శాపం వల్లే టైటాన్ ప్రమాదం బారిన పడిందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీనికి టైటానిక్‌తో ముడిపడి ఉన్న సంఘటనలను ఉదాహరణగా చూపుతూ శాపం వల్లే ఇలా జరిగిందని అనుకుంటున్నారు. 1912లో అట్లాంటిక్ లోని భారీ మంచు కొండను ఢీకొని మునిగిపోయింది. అయితే టైటానిక్ ఓడను నిర్మిస్తున్న సమయంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయి. టైటానిక్ ఓడను బెల్ ఫాస్ట్ లో నిర్మిస్తున్న సమయంలో హార్లాండ్ అండ్ వోల్ఫో షిప్ యార్డులో 8 మంది వరకు కార్మికులు మరణించారని నివేదికలు చెబుతున్నాయి. నిర్మాణ సమయంలోనే సిబ్బంది ఒకరు దానిపై నుంచి పడి చనిపోయారు.
ఇక టైటానిక్ తొలి ప్రయాణం బ్రిటన్ లోని సౌతాఫ్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వరకు ఉంది. అయితే తన తొలి ప్రయాణం మొదట్లోనే ఎస్ఎస్ సిటీ ఆఫ్ న్యూయార్క్ అనే నౌకను ఢీకొనేది. అయితే తృటిలో ఈ ప్రమాదం తప్పింది. టైటానిక్ తో పోలిస్తే ఎస్ఎస్ సిటీ ఆఫ్ న్యూయార్క్ నౌక టైటానిక్ తో పోలిస్తే చాలా చిన్నది. టైటానిక్ ఇంజన్లు స్టార్ట్ అయిన సమయంలో దాని మూడు ప్రొపెల్లర్లు తీరగడం ప్రారంభమయ్యాయి. ఆక్షణంలో దగ్గర ఉన్న ఎస్ఎస్ సిటీ ఆఫ్ న్యూయార్క్ నౌకను లాగేసే ప్రయత్నం జరిగింది. ఇది గమనించిన టైటానిక్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఇంజిన్ లను పూర్తివేగంతో ముందుకు వెళ్లాలని ఆదేశించడంతో ప్రమాదం తప్పింది. ఇలా వరసగా టైటానిక్ తో ముడిపడి ఉన్న ప్రమాదాలు ఆ నౌకను శాపగ్రస్తమైందిగా పేర్కొంటున్నాయి. ఈ శాపమే టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రమాదానికి కారణమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.