Hyundai Creta facelift: భారతదేశంలో రెండో అతిపెద్ద కార్ మేకర్‌గా ఉన్న హ్యుందాయ్ నుంచి కొత్తగా క్రెటా ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ విభాగంలో మార్కెట్ టాప్ ప్లేస్‌లో ఉన్న క్రేటా న్యూ అవతార్‌లో రాబోతోంది. జవవరి 16న లాంచ్ చేసేందకు హ్యుందాయ్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్ కోసం రూ. 25,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్‌ని ప్రారంభించింది. గతేడాది 2023లో క్రేటా మంచి అమ్మకాలను నమోదు చేసింది. 1,57,311 కార్లను విక్రయించింది. జూలై 15, 2015లో ప్రారంభమైన క్రెటా దేశవ్యాప్తంగా 9,50,000 కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది.
స్టైలిష్ లుక్స్, నయా ఫీచర్స్:
కొత్తగా రాబోతున్న క్రేటా ఫేస్‌లిఫ్ట్-2024 మరింత ఆకర్షణీయమైన లుక్‌తో, టెక్ లోడెడ్ ఫీచర్లతో వస్తోంది. కొత్త గ్రిల్, రీడిజైన్డ్ క్వాడ్-బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED స్ట్రిప్ కనెక్టెడ్ ల్యాంప్స్, రీడిజైన్డ్ రియర్ బంపర్ ఉన్నాయి. స్పోర్టీ లుక్స్‌ని ఇచ్చే అల్లాయ్ మీల్స్ మరింత స్టైలిష్‌గా ఉంటబోతోంది.
డాష్ బోర్డులో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ని కనెక్ట్ చేయడంతో క్యాబిన్ మరింత ప్రీమియంగా మారనుంది. ADAS ఫీచర్లు, 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే, రేంజర్ ఖాకీ, ఫైరీ రెడ్ మరియు కొత్త రోబస్ట్ ఎమరాల్డ్ పర్ల్ వంటి ఆరు మోనోటోన్ కలర్స్‌లో వస్తోంది. E, EX, S, S(O), SX, SX Tech మరియు SX(O) వంటి 7 ట్రిమ్స్‌లో లభ్యమవుతుంది.
మూడు ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. టర్బో పెట్రోల్ వేరియంట్ 1.5-లీటర్ కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజన్-160PS మరియు 253Nm శక్తిని ఇస్తుంది. 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజన్-115PS, 144Nm జనరేట్ చేస్తుంది. 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్ 116 PS శక్తిని, 250 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
నాలుగు ట్రాన్స్‌మిషన్ల ఛాయిస్‌లతో క్రేటా ఫేస్‌లిఫ్ట్ వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT), 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AT) ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా 2024 ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, త్వరలో రాబోతున్న మారుతి కర్వ్ వంటి మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు పోటీ ఇస్తుంది. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల(ఎక్స్-షోరూం) మధ్య ఉండనుంది.