Arvind Kejriwal: బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటోంది.. లిక్కర్ స్కామ్‌పై కేజ్రీవాల్ సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాల నడుమ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం ఏంటంటే.. అవినీతే జరగలేదని, బీజేపీ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. నా పెద్ద ఆస్తి నిజాయితీ అని, వారు దానిని దెబ్బతీయాలనుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిన ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ లక్ష్యం తనను అరెస్ట్ చేయించడమే కాదని, తనను లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే అని చెప్పారు. దర్యాప్తును సాకుగా చెప్పి తనను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
రెండేళ్లుగా బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి పలువురిని అరెస్ట్ చేసిందని, ఈ స్కామ్‌లో ఒక్క రూపాయి కూడా పట్టుబడలేదని, స్కామ్ జరిగితే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని, గాలిలో మాయమైందా..? అంటూ ప్రశ్నించారు. నిజం ఏంటంటే అసలు స్కామే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో గుండాయిజం పెరిగిందని, ఎవరినైనా అరెస్ట్ చేసి లోపలేస్తోందని ఆరోపించారు. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, దీనిపై ఈడీకి లేఖ రాస్తూ ఎలా చట్టవిరుద్ధమో వివరించాలని, వారి నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల ముందే తనకు ఎందుకు సమన్లు పంపారని ప్రశ్నించారు. 8 నెలల క్రితం సీబీఐ పిలిచినప్పుడు వెళ్లానని, అయితే ఇప్పుడే తనను ఎందుకు విచారణ పేరుతో పిలుస్తున్నారంటూ ప్రశ్నించారు.
ఇప్పటి వరకు కేజ్రీవాల్‌కి ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. మూడుసార్లు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆప్ లోని కీలక నేతల్లో భయాందోళన మొదలైంది. అయితే అలాంటిదేం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో నాలుగో సారి సమన్లను జారీ చేసేందుకు ఈడీ మరోసారి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ విచారణతో పిలిచి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కూడా ఇలాగే జరుగుతుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
#WATCH | On ED summons in liquor police case, Delhi CM & AAP leader Arvind Kejriwal says, "The truth is that there was no corruption. BJP wants to arrest me. My biggest asset is my honesty & they want to dent it. My lawyers have told me that summons sent to me are illegal. BJP's… pic.twitter.com/jLWmkZ2mxj
— ANI (@ANI) January 4, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!