Moblie Blast: జేబులో పేలిన సెల్‌ఫోన్.. యువకుడికి తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moblie Blast: బైకు పైన వెళ్తున్న యువకుడి జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన బెంగళూర్ లోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంతో బుధవారం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ప్రసాద్‌గా గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ బుధవారం బైక్‌పై వెళ్తూ తన మొబైల్‌ని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఆ సమయంలో మొబైల్ ఒక్కసారిగా పేలింది. పేలుడు వల్ల నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వైట్ ఫీల్డ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Israel: ఇజ్రాయిల్‌పై దక్షిణాఫ్రికా కేసు.. వచ్చే వారం ప్రపంచ న్యాయస్థానంలో విచారణ..
Also Read
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
మొబైల్ ఫోన్ పేలిన ఘటన ప్రసాద్ మొబైల్ కొనుగోలు చేసిన షోరూం దృష్టికి వచ్చింది. ప్రసాద్ వైద్యానికి అయ్యే చిన్నచిన్న ఖర్చులను భరిస్తామని, మొబైల్ డబ్బుల్ని తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భాగానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని షోరూం భరించాలని యువకుడి బంధువులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే పూర్తిగా డబ్బులు చెల్లించేందుకు షోరూం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో కర్ణాటక షియోగాలోని సొరబ తాలూకాలో కూడా ఇలాగే బైక్‌పై వెళ్తున్న యువకుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్ పేలింది. పేలుడు కారణంగా బైక్ అదుపుతప్పి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో 76 ఏళ్ల వృద్ధుడి జేబులో ఫోన్ పేలింది.
తాజావార్తలు
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!