S Jaishankar: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలపై విమర్శనాత్మకంగా స్పందించారు. చైనాతో భారత సంబంధాల విషయంలో మాట్లాడుతూ ఆయన చరిత్రలో జరిగిన అంశాలను గుర్తు చేశారు. ఢిల్లీలో ‘వై భారత్ మాటర్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. చైనా, పాకిస్తాన్, అమెరికా సంబంధాలను గురించి మాట్లాడారు.
చైనా విషయంలో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరూ భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారని, ఇది తన ఊహ కాదని దీనికి సంబంధించి అనేక లేఖలు ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని భారత్ తీసుకోకపోవడాన్ని ప్రస్తావించారు. జవహర్ లాల్ నెహ్రూ ‘‘ భారతదేశ ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. చైనాలో సంబంధాలపై ఆశలు పెంచుకునే వాళ్లం కాదు’’ అటూ వ్యాఖ్యానించారు.
Read Also: BJP: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు..
భద్రతా మండలిలో సభ్యత్వంపై నెహ్రూ, చైనాను సపోర్టు చేయడాన్ని ప్రస్తావించారు. 1962 చైనా-భారత్ యుద్ధంలో నెహ్రూ అమెరికా సాయాన్ని కోరేందుకు సంకోచించారని, అయితే పటేల్ మాత్రం అమెరికాతో మనం ఎందుకు అమనమ్మకంగా ఉండాలనే ధోరణితో ఉండేవారని, మన సొంత ప్రయోజనాల దృష్టితోనే అమెరికాను చూడాలని, అమెరికా, చైనాతో ఎలా వ్యవహరిస్తుందనేది కాదని వల్లభాయ్ పటేల్ చేసిన వ్యాఖ్యల్ని జైశంకర్ గుర్తు చేశారు. కొత్త ఏడాదిలో ప్రపంచస్థాయిలో ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకు భారత్ ఆర్థికంగా, రాజకీయంగా సిద్ధంగా ఉందని జైశంకర్ అన్నారు.