NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పరిణామాలు మహారాష్ట్రలోనే కాక, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పార్టీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తారు.
India: భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచం అంతా ఆర్థికమాంద్యంతో బాధపడుతుంటే.. భారత్ మాత్రం ఈ ఏడాది జీడీపీలో టాప్ 1 స్థానంలో నిలుస్తుందని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో భారతదేశంలో మధ్యతరగతి వర్గం వేగంగా విస్తరిస్తోందని..
వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి నడుస్తూ.. మోకాలిపై వంగి ప్రియుడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. ఈ సన్నివేశంలో అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యపోయారు. కొంతమంది దీన్ని ఫోన్లలో బంధించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరిపై విమర్శలు వెల్లువెత్తాయి.
Monkey snatches bag: ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోతుల బెదడ ఎక్కువైంది. ఊళ్లలో మనుషులపై దాడులతో పాటు పంటను ధ్వంసం చేస్తున్నాయి. అడవులు తరిగిపోవడంతో కోతులు ఊళ్లపై పడుతున్నాయి. కొన్ని సార్లు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. మనం వంటిళ్లలో కొన్ని సందర్భాల్లో పోపుల పెట్టెల్లో బంగారాన్ని పెట్టుకుంటాం.. కొన్నిసార్లు ఈ డబ్బాలను కూడా కోతులు తీసుకెళ్లిన ఘటనలు గతంలో జరిగాయి.
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారతదేశానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు
Tomato stolen: ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది.
Delhi: ఢిల్లీలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. అనేక హత్యల్లో కాంట్రాక్ట్ కిల్లర్ గా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కాంట్రాక్ట్ కిల్లర్ కమిల్ గాయపడ్డాడు. లొంగిపోవాలని కోరినా కూడా కమిల్ పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు తిరిగి జరిపిన కాల్పుల్లో అతను గాయపడ్డారు. తరువాత అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది.
France riots: అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా పారిస్ నగరంలో ఆందోళనలతో అట్టుడుకుతోంది. నహెల్ అనే 17 ఏళ్ల యువకుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనం అపకపోవడంతో, ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో దురదృష్టవశాత్తు మరణించాడు. అప్పటి నుంచి ఆ దేశంలో వరసగా అల్లర్లు జరుగుతున్నాయి. ఇమన్యుయల్ మక్రాన్ ప్రభుత్వం అల్లర్లను అణిచివేయలేకపోతోంది.
Vande Bharat trains: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను ఇప్పటికే పలు రూట్లలో ప్రవేశపెట్టారు. సెమీ హైస్పీడ్ రైలుగా ప్రసిద్ధి చెందిన వందేభారత్ రైళ్లు తక్కువ సమయంలోనే ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇదిలా ఉంటే వందేభారత్ ట్రైన్ ఛార్జీలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఛార్జీలపై రైల్వే శాఖ సమీక్షిస్తుంది. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న మార్గాల్లో మాత్రమే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
Earthquake: ఐస్లాండ్ రాజధాని రేక్జావిక్ పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు అయ్యాయని ఆ దేశ వాతావరణ కార్యాలయం బుధవారం వెల్లడించింది.