Mission to Space Station: ఐఎస్ఎస్‌కి భారత వ్యోమగామి.. ఐఏఎఫ్ పైలట్లకు నాసా శిక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mission to Space Station: భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి సిద్ధమవుతోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానిక దళానికి చెందిన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంలో భాగంగా పైలట్లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. 2024 నాటికి భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్‌కి పంపించాలనే మనదేశం భావిస్తోంది.
అయితే, శిక్షణ తీసుకుంటున్న భారత వ్యోమగామి అభ్యర్థుల గుర్తింపును వెల్లడించలేదు. వీరంతా ఇప్పటికే రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో ప్రారంభ శిక్షణ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని నాసా యొక్క జాన్సన్ స్పేస్ సెంటర్‌లో అధునాతన శిక్షణ పొందుతున్నారు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
భారత్ తరుపున వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ పౌరుడిగా నిలిచారు. ప్రస్తుతం గగన్ యాన్ ద్వారా భారత్ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపి, వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఐఎస్ఎస్ మిషన్ భారతదేశం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గగన్ యాన్’ మిషన్‌కి కీలకంగా మెట్టుగా మారబోతోంది. గగన్యాన్ మిషన్ సన్నాహాలలో భాగంగా, ఇస్రో 2024 లో రెండు మానవరహిత మిషన్లను నిర్వహించాలని యోచిస్తోంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) భూమికి 400 కిలోమీటర్లకు ఎగువన, భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మానవ నిర్మిత ఓ ప్రయోగశాల. లో ఎర్త్ ఆర్బిట్‌లో భూమి చుట్టూ తిరుగుతుంది. దీని నిర్మాణంలో రష్యా, అమెరికా, జపాన్, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాల అంతరిక్ష సంస్థల సహకారం ఉంది. మానవులు ఉండేందుకు, పలు రక్షాల ప్రయోగాలు, పరీక్షలు జరిగేందుకు దీనిని నిర్మించారు.
తాజావార్తలు
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!