Venu Goapl Reddy
Author- NTV Telugu-
Kamal Nath: కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. బీజేపీలోకి ఎంపీ మాజీ సీఎం..?
Kamal Nath: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కీలక నేతలు చేజారిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎంగా ఉన్న కమల్ నాథ్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సోషల్ మీడియాలో తన బయో నుంచి కాంగ్రెస్‌ని తొలగించడం వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు ఈ రోజు కమల్ నాథ్ న్యూఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడే బీజేపీ… -
Tejashwi Yadav: “క్షమించాలని” సీఎం నితీష్ కుమార్ లాలూని వేడుకున్నారు..
Tejashwi Yadav: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమతో పొత్తు పెట్టుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్‌ని క్షమించాలని కోరాడని ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ అన్నారు. 2022లో పొత్తు పెట్టుకోవడానికి ముందు లాలూను గత ద్రోహాన్ని మరిచి క్షమించాలని కోరాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెలలో నితీష్ కుమార్ ఆర్జేడీ పొత్తును కాదని మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాడు. -
PM Modi: రాముడు లేడన్న వాళ్లు, ఇప్పుడు “జై సియారం” అంటున్నారు..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిరంపై ఆ పార్టీ వైఖరిని ఉద్దేశిస్తూ ఈ రోజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికి ఊహాత్మకం అని, ఆలయాన్ని నిర్మించొద్దనే వారని, కాని ఇప్పుడు వారే ‘జై సియారం’ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని, ఇది ప్రజల వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. -
Paytm Crisis: పేటీఎంకి ఆర్బీఐ ఊరట.. మార్చి 15 వరకు గడువు పెంపు..
Paytm Crisis: డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం పరిస్థితి తారుమారైంది. ఫారన్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆర్బీఐ పేటీఎంకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. మార్చి 15 వరకు గడువు పొడగిస్తున్నట్లు తెలిపింది. -
Israel: పాలస్తీనాను దేశంగా అంగీకరించేది లేదు.. అమెరికా ప్రయత్నాలపై పీఎం నెతన్యాహూ..
Israel: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలైన వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లపై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటికే 28,700 మందికి పైగా మరణించారు. మరోవైపు యుద్ధం నిలిపేయాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటప్పటికీ.. హమాస్‌ని పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు. -
UK: భాగస్వామిని గర్భవతి చేసేందుకు.. తండ్రి వీర్యంతో మిక్స్..
UK: తన భాగస్వామిని గర్భవతిని చేసేందుకు ఓ వ్యక్తి అనూహ్యమైన చర్యలకు పాల్పడ్డాడు. సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్న వ్యక్తి తన తండ్రి వీర్యంతో తన వీర్యాన్ని మిక్స్ చేశాడు. తాజాగా ఈ కేసు కోర్టుకు చేరుకుంది. ఇంగ్లాండ్‌లోని బార్న్స్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన కారణాల వల్ల సదరు వ్యక్తి, అతని పార్ట్నర్ పేర్లను వెల్లడించలేదు. సంతానోత్పత్తి సమస్యల వల్ల ఐవీఎప్ చికిత్సను భరించే శక్తి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు గార్డియన్ ఒక నివేదికలో పేర్కొంది. -
Baba Vanga: 2024లో నిజమవుతున్న బాబా వంగ జోస్యం..
Baba Vanga: బాబా వంగా గురించి తెలియని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఈ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త అంచనా వేసిన భవిష్యత్ సంఘటనలు నిజమవుతున్నాయి. 2024లో ఆమె అంచనా వేసిన సంఘటనలు నిజమవుతున్నాయి. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని పిలిచే బాబా వంగా, 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు మరియు బ్రెక్సిట్ వంటి ప్రధాన ప్రపంచ సంఘటనలను ముందే అంచనా వేశారు. తాజాగా ఆమె అంచనా వేసినట్లు 2024లో జపాన్, యూకే వంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో… -
India’s defence: భారతదేశ రక్షణకు పెద్ద పీట.. రూ.84,540 కోట్ల విలువైన కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం..
India's defence: భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత పెంపొందించేలా, ఢిపెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) ₹ 84,560 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపానదల్లో యాంటి ట్యాంక్ మైన్స్, హెవీ వెయిట్ టార్పిడోలు, మల్టీ మిషన్ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు ఉన్నాయి. వీటికి రక్షణ మంత్రి శాఖ అనుమతి లభించింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ కొనుగోళ్లకు శుక్రవారం పచ్చజెండా ఊపింది. -
Breaking News: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవెల్నీ జైలులో మృతి..
Breaking News: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించే వ్యక్తిగా నవల్నీకి గుర్తింపు ఉంది. -
Law Commission: ఎన్ఆర్ఐలు, ఓసీఐలు భారతీయులను వివాహం చేసుకోవడంలో “ఆందోళనకర ధోరణి”..
Law Commission: ఎన్నారైలు భారతీయ పౌరులను ముఖ్యంగా అమ్మాయిలను మోసపూరితంగా వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాసులు, భారతీయులను పెళ్లి చేసుకునే విషయంలో సమగ్ర చట్టాలను తీసుకురావాలని లా ప్యానెల్ సిఫారసు చేసింది. "ప్రవాస భారతీయులు మరియు విదేశీ పౌరులకు సంబంధించిన మ్యాట్రిమోనియల్ ఇష్యూలపై చట్టం"పై ప్యానెల్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) రీత్ రాజ్ అవస్తీ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు నివేదిక అందించారు.
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!