Gujarat: ఆదర్శ భార్య.. 10 ఏళ్లలో 7 సార్లు భర్తను అరెస్ట్ చేయించి, తానే బెయిల్ ఇప్పించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ గృహహింస కింద భర్తను అరెస్ట్ చేయించి, తానే బెయిల్ ఇప్పిస్తూ వస్తోంది. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 10 ఏళ్లలో తన భర్తను 7 సార్లు అరెస్ట్ చేయింది. చివరకు బెయిల్ ఇప్పిస్తూ వస్తుంది. ప్రేమ్‌చంద్ మాలి మరియు అతని భార్య సోను దంపతులు మెహసానా జిల్లాలోని కడి పట్టణంలో నివసిస్తున్నారు. 2001లో వీరిద్దరికి వివాహం జరిగింది. 2014 నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
2015లో మొదటిసారిగా సోనూ తన భర్త ప్రేమ్ చంద్ భౌతిక దాడికి పాల్పడినందుకు కేస్ పెట్టింది. ఇదే తొలి కేసు. ఆమెకు నెలవారీగా రూ. 2000 భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే రోజూవారీ కూలీకి వెళ్లే ప్రేమ్ చంద్ భరణం చెల్లించకపోవడంతో మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత, భార్య సోనూనే తన భర్త కోసం బెయిల్ రెడీ చేసింది. వీరిద్దరు విడివిడిగా జీవితం ప్రారంభించినప్పటికీ, వారి మధ్య సయోధ్య కుదర్చడం, మళ్లీ గొడవలు రావడం పరిపాటిగా మారింది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
Read Also: వర్షాకాలంలో గ్యాస్ సమస్యలు బాధిస్తున్నాయా?.. ఈ చిట్కాలు పాటించండి..
కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు మళ్లీ ఒకటిగా జీవించడం ప్రారంభించారు. ఆ తరువాత కూడా గొడవలు తారాస్థాయికి చేరాయి. ప్రేమ్ చంద్ పై 2016 నుంచి 2018 వరకు సోనూ నుంచి ఫిర్యాదులు రావడం, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేయడం అలవాటుగా మారిపోయింది. కానీ ప్రతీసారి అరెస్ట్ చేయించి భార్య సోనూనే అతడికి బెయిల్ ఇస్తూ వచ్చేది. ప్రేమ్ చంద్ 2019, 2020లో కూడా జైలు పాలయ్యాడు. మళ్లీ సోనూనే రక్షించింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా భరణం చెల్లించని కారణంగా ప్రేమ్ చంద్ అరెస్ట్ అయ్యాడు. జూలై 4న విడుదలయ్యాడు.
అయితే ఇటీవల విడులైన సమయంలో ప్రేమ్ చంద్ పర్సు, మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. ఆ తరువాత మళ్లీ సోనూతో గొడవ జరిగింది. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు చేయిజేసుకున్నారు. ప్రేమ్ చంద్ చివరకు ఇంటిని విడిచిపెట్టి పటాన్ లోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయాడు. సోనూ, తన కొడుకు తనకు హాని చేస్తారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..