Vande Bharat Express: ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత రైల్వే తీసుకువచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాళ్ల దాడికి గురైంది. కేంద్రం ఈ రైలును ప్రారంభించిన తర్వాత ఇప్పటికే పలు మార్గాల్లో రైలుపై రాళ్ల దాడి జరిగింది. తాజాగా కొత్తగా ప్రారంభించిన గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Sreemukhi Hot: నల్ల కోక కట్టి అందాలన్నీ చూపిస్తున్న శ్రీముఖి.. కొత్త ఫోటోలు చూశారా?
అయితే ఇటీవల ట్రాక్ వద్ద మేస్తున్న మేకలను వందేభారత్ రైలు ఢీకొట్టంది. అయతే తన మేకలు చనిపోవడానికి రైలే కారణం అని కొంతమంది వ్యక్తులు రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రైలు అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రెండు కోచ్ ల కిటికీలు దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు రౌనాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహవాల్ గుండా వెళ్తుండగా దాడి జరిగిందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్‌స్పెక్టర్ సోను కుమార్ సింగ్ తెలిపారు.
ఈ సంఘటన గురించి ఎస్‌ఎస్‌పి (అయోధ్య) ఆర్‌కె నయ్యర్ మాట్లాడుతూ..ఆదివారం, రైల్వే ట్రాక్‌పై మేస్తున్నప్పుడు వందే భారత్ రైలు ఢీకొని నన్హు పాశ్వాన్‌కు చెందిన మేకల మంద చనిపోయిందని దర్యాప్తులో తేలింది, దీంతో కోపం పెంచుకున్న నన్హు పాశ్వాన్ తన ఇద్దరు కొడుకులు అజయ్, విజయ్ లతో కలిసి రైలుపై రాళ్లు రువ్వారు. మేకలు చనిపోయానే ప్రతీకారంతోనే దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 7, 2023న గోరఖ్‌పూర్ మరియు లక్నోలను కలుపుతూ వందేభారత్ రైలును ప్రారంభించారు. దీంతో కలిపి దేశవ్యాప్తంగా పలు రూట్లలో 25 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.