Cheetah Die: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)లో వరసగా చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా ఈ రోజు మరో మగ చిరుత మరణించింది. మూడు నెలల్లో కునోలో 7వ చిరుత మరణించింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో చిరుత మెడపై గాయాలు గమనించిన తర్వాత వైద్య బృందాన్ని అప్రమత్తం చేశారు. గాయానికి చికిత్స చేసేందుకు మత్తు మందు ఇచ్చి చికిత్స చేశారు. మగ చిరుత తేజస్ మధ్యాహ్నం 2 గంటలకు చనిపోయిందని, గాయాలపై దర్యాప్తు చేస్తుననట్లు, శవపరీక్ష తర్వాత మరణానికి కారణాలు తెలుసుకోవచ్చని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ JS చౌహాన్ తెలిపారు.
Read Also: Poverty: భారత్‌లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..
మార్చి 27న సాషా అనే ఆడ చిరుత కిడ్నీ వ్యాధితో మరణించింది. అంతకుముందు ఏప్రిల్ 23న ఉదయ్ అనే చిరుత కార్డియో పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా మరణించింది. మే 9న దక్ష లనే ఆడి చిరుత మేటింగ్ సమయంలో మగ చిరుతల దాడిలో మరణించింది. మే 25న రెండు చిరుత పిల్లలు తీవ్ర వాతావరణ పరిస్థితులు, డీహైడ్రేషన్ కారణంగా చనిపోయాయి.
అంతకుముందు కునోలో రెండు నెలల వ్యవధిలో మూడు చిరుత పిల్లలతో సహా ఆరు చిరుతలు మరణించడం వెనక ఎలాంటి లోపాలు లేవని కేంద్రం తెలిపింది. వన్యప్రాణుల్లో ముఖ్యంగా చిరుతల విషయంలో 90 శాతం పిల్లల మరణాలు ఉంటాయని అటవీ అధికారులు చెప్పారు. మేలో ఆరు మరణాల తర్వాత దక్షిణాఫ్రికాలో వన్యప్రాణుల నిపుణుడు విన్సెంట్ వాన్ డెర్ మెర్వే మరిన్ని మరణాలు అంచనా వేశారు. చిరుతలు, పులల మధ్య తమ ప్రాంతీయ భూభాగాల ఆధిపత్యం కోసం ప్రయత్నించే సమయంలో మరిన్ని మరణాలు సంభవించే అవకాశ ఉందని చెప్పారు.