Venu Goapl Reddy
Author- NTV Telugu-
The Indrani Mukerjea Story: “షీనాబోరా హత్య”పై నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్కి హైకోర్టు అనుమతి.. అసలేంటీ ఈ కేసు..?
The Indrani Mukerjea Story: 2012లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది షీనాబోరా హత్య- ఇంద్రాణి ముఖర్జియా కేసు. సొంత తల్లి తన కూతురిని హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్ రూపొందించిది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విడుదలపై స్టే ఇవ్వాలని విచారణ సంస్థ సీబీఐ బాంబే కోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు రేవతి మోహితే డేరే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ పిటిషన్‌ని కొట్టేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్… -
Sandeshkhali: సందేశ్‌ఖలీలో ముందే హోలీ వేడుకలు.. టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్ అరెస్టుతో వేడుకలు..
Sandeshkhali: సందేశ్‌ఖలీ లైంగిక వేధింపుల నిందితుడు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 10 రోజుల కస్టడీ విధించింది. మరోవైపు టీఎంసీ అతడిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడిని అరెస్ట్ చేయాలని కొన్ని వారాలుగా సందేశ్‌ఖలీలో మహిళలు, అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీరికి బీజేపీతో సహా పలు విపక్షాలు మద్దతు తెలిపాయి. -
Monkey fever: మంకీ ఫీవర్‌తో మరొకరు మృతి.. 10 రోజుల్లో మూడో మరణం..
Monkey fever: కర్ణాటక రాష్ట్రంలో ‘మంకీ ఫీవర్’ వ్యాధి కలవరపెడుతోంది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ)గా పిలువబడే ఈ వ్యాధి బారిన పడి మరో వ్యక్తి మరణించాడు. చిక్కమగళూర్‌లో 43 ఏళ్ల వ్యవసాయ కూలీ బుధవారం ఉదయం మృతి చెందింది. కేఎఫ్‌డీ ఇన్ఫెక్షన్తో మహిళ ఫిబ్రవరి 21న శివమొగ్గలోని మెగాన్ హాస్పిటల్లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో 10 రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. మరోవైపు కేఎఫ్‌డీ వ్యాక్సిన్ల స్టాక్ అయిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
Matrimonial fraud: మ్యాట్రిమోని ద్వారా 250 మంది మహిళలను మోసం చేసిన 45 ఏళ్ల వ్యక్తి..
Matrimonial fraud: ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ మోసాలు పెరుగుతున్నాయి. గతంలో పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు ఉంటే, ఇప్పుడు మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు తమకు నచ్చిన సంబంధాలను మ్యాట్రిమోని సైట్లలో వెతుక్కుంటున్నారు. ఇదే మోసగాళ్లకు వరంగా మారింది. తాజాగా రాజస్థాన్‌కి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఒకర్నికాదు ఇద్దర్ని కాదు ఏకంగా 250 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో చిక్కుకుపోయిన 20 మంది భారతీయులు..
Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో కనీసం 20 మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరింతా భారత అధికారులను సంప్రదించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఈ రోజు వెల్లడించింది. వీరిని సురక్షితంగా భారత్ తీసుకురావడానికి రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణదీప్ జైశ్వాల్ చెప్పారు. -
Semiconductor Plants: దేశంలో 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు క్యాబినెట్ ఆమోదం.. పెట్టుబడి విలువ రూ. 1.26 లక్షల కోట్లు..
Semiconductor Plants: ఎలక్ట్రాన్సిక్స్, ఆటోమొబైల్ రంగంతో పాటు శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతో కీలకమైన సెమీకండక్టర్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చైనా, తైవాన్ వంటి దేశాల గుత్తాధిపత్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లోనే చిప్ తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు భారతదేశంలో మూడు సెమీకండక్టర్ల ప్లాంట్లనను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. రానున్న 100 రోజుల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు. -
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 30,000 దాటిన మృతుల సంఖ్య…
Gaza War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడికి పాల్పడి 1200 మందిని చంపేయడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ ఆర్మీ గాజాతో పాటు పాలస్తీనా భూభాగాలపై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌తో పాటు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని హమాస్ స్థావరాలు, మిలిటెంట్లు లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్‌ని పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని… -
Leopard Population: దేశంలో పెరిగిన చిరుతపులుల జనాభా.. ఈ రాష్ట్రాల్లోనే అధికం..
Leopard Population: దేశంలో చిరుత పులుల సంఖ్య 2018-2022 మధ్య పెరిగినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ కాలంలో 1.08 శాతం వృద్ధితో 13,874కి చిరుతల సంఖ్య చేరుకుంది. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక చిరుతపులుల ఉన్నట్లు పేర్కొంది. ఈ రాష్ట్రంలో 3907 చిరుతలు ఉండగా.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(1985), కర్ణాటక(1879), తమిళనాడు(1070) ఉన్నాయి. -
Delhi: బీజేపీ మహిళా కార్యకర్త దారుణహత్య.. ప్లే స్కూల్లో మృతదేహం..
Delhi: బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్లో బుధవారం పోలీసులు కనుగొన్నారు. నరేలాలోని స్వతంత్ర నగర్లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తన వ్యాపార భాగస్వామి సోహన్ లాల్‌తో చివరిసారిగా కనిపించింది. -
Calcutta High Court: తృణమూల్ నేత షేక్ షాజహాన్‌పై తమకు “సానుభూతి” లేదన్న హైకోర్టు.. సందేశ్‌ఖలి అఘాయిత్యాల్లో ప్రమేయం..
Calcutta High Court: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ని ఎట్టకేలకు 50 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణంలో విచారణ జరిపేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు దాడులకు తెగబడ్డారు. అంతే కాకుండా సందేశ్‌ఖలి ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో బెంగాల్‌లోని సందేశ్‌ఖలిలో మహిళలు, యువత టీఎంసీ లీడర్లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 55 రోజుల పరారీ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!