Venu Goapl Reddy
Author- NTV Telugu-
Breaking News: ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా..
Breaking News: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. -
Gangster: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్, ఆర్ఎస్ఎస్ నేత హత్యలో నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్..
Gangster: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక వ్యక్తి, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మహ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేసింది. నియాజీపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. 2016లో బెంగళూర్‌లో ఆర్ఎస్ఎస్ నేత రుద్రేష్ని హత్య చేసిన కేసులో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత నియాజీ విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులు ఇతడి కోసం వెతుకుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాలో పట్టుబడటం ఎన్ఐఏకి గొప్ప విజయంగా చెప్పవచ్చు. -
Nuclear Cargo: చైనా నుంచి పాక్ వెళ్తున్న నౌకని ముంబైలో నిలిపివేత.. “అణు కార్గో” ఉన్నట్లు అనుమానం..
Nuclear Cargo: చైనా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ కార్గో నౌకను భారత అధికారలు ముంబై పోర్టులో అడ్డుకున్నారు. పాకిస్తాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం వినియోగించే సరకు ఉందనే అనునమానంతో ముంబై నవ షేవా నౌకాశ్రయంలో భారత అధికారులు శనివారం నిలిపేశారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా.. జనవరి 23న కరాచీకి వెళ్లే మార్గంలోని వెళ్తున్న సీఎంఎ సీజీఎం అట్టిలా నౌకను నిలిపేశారు. నౌకలో ఉన్న సరుకును పరిశీలించారు. ఇందులో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) అనే యంత్రం ఉన్నట్లు, ఇది… -
Rameshwaram Cafe Blast: మంగళూర్, బెంగళూర్ పేలుళ్లకు లింక్.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
Rameshwaram Cafe Blast: బెంగళూర్ నగరంలోని రామేశ్వరం కేఫ్ పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడులో 10 మంది గాయపడ్డారు. పథకం ప్రకారమే నిందితుడు ఐఈడీ బాంబుకు టైమర్‌ని అమర్చి పేల్చినట్లు తెలుస్తోంది. 2022 మంగళూర్లో జరిగిన ప్రెషర్ కుక్కర్ పేలుడుకు, తాజాగా జరిగిన బెంగళూర్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం అన్నారు. బెంగళూర్ లోని ఐటీ కారిడార్‌లోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ… -
Udhayanidhi Stalin vs Annamalai: మీరు డీఎంకేని టచ్ చేయలేరు.. నువ్వో విఫల నటుడివి..
Stalin vs Annamalai: తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై కూడా అంతే ధీటుగా స్పందించడంతో ఇరు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమిళనాడు రాష్ట్రం పన్నులుగా చెల్లించిన ప్రతీ రూపాయిలో కేంద్రం తిరిగి 28 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ‘28 పైసా మోడీ’ అంటై ప్రధానిని విమర్శించారు. -
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్న షెహబాజ్ షరీఫ్..
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సహకారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్‌ని ఆదివారం ప్రధానిగా ఎన్నుకోనున్నారు. మరోవైపు జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఒమర్ అయూబ్ ఖాన్ని తన ప్రధానమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేసింది. అయితే, ఇతను గెలిచే పరిస్థితి లేదు. -
Rameshwaram Cafe: సీసీటీవీలో భయానక పేలుడు దృశ్యాలు.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ వీడియోలు వైరల్..
Rameshwaram Cafe: బెంగళూర్‌లో ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి రెస్టారెంట్లో బ్యాగ్ వదిలిసి వెళ్లాడు. అందులో ఉన్న బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధ్రువీకరించారు. ఐఈడీని పేల్చేందుకు టైమర్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. -
Election Commission: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఈసీ కీలక హెచ్చరిక..
Election Commission: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్‌గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ బ్లాస్ట్.. ధృవీకరించిన సీఎం సిద్ధరామయ్య..
Rameshwaram Cafe: బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో ఈ రోజు మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బాంబు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ధృవీకరించారు. ప్రముఖ ఫుడ్ జాయింట్‌గా ఉన్న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో 9 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాంబ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. -
Annamalai: లోక్‌సభ బరిలో ‘‘సింగం అన్న’’.. తమిళనాట బీజేపీ తురుపుముక్క ‘‘అన్నామలై’’
Annamalai: ద్రవిడ రాజకీయాల్లో జాతీయవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కే అన్నామలై. బీజేపీకి తమిళనాడులో అన్నామలై ఒక తురుపుముక్కగా ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ చీఫ్ జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించే దిశగా ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. 39 ఏళ్ల ఈ మాజీ ఐపీఎస్ అధికారికి బీజేపీ అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛనిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై లోక్‌సభ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలో నిలిపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!