Assam: “బహుభార్యత్వం”పై హిమంత ఉక్కుపాదం.. అసెంబ్లీలో బిల్లుకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: బహుభార్యత్వాన్ని నిషేధించేందుకు అస్సాంలోని హిమంత బిశ్వసర్మ సర్కార్ సిద్ధమైంది. బహుభార్యత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టనుంది. డిసెంబర్‌లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడాన్ని ఈ బిల్లు నిషేధించనుంది.
సీఎం హిమంత బిశ్వసర్మ శనివారం అస్సాంలోని టిన్సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాుడుతూ.. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును ప్రభుత్వం రాబోయే 45 రోజుల్లో ఖరారు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ కమిటీన ఏర్పాటు చేశామని, ప్రజల నుంచి సానుకూల ఆలోచనలు వచ్చాయని, ప్రజల నుంచి అభిప్రాయాలను, సూచనలు కోరితే మొత్తం 149 సూచనలు వచ్చాయని, ఇందులో 146 మంది బిల్లుకు మద్దతు ఇచ్చారని, 3 మాత్రం బహుభార్యత్వాన్ని నిషేధించడంపై వ్యతిరేఖత వ్యక్తం చేశారని, మా తదుపరి దశ బిల్లును రూపొందించడమే అని సీఎం హిమంత బిశ్వ సర్మ చెప్పారు.
Also Read
Read Also: Sonia Gandhi: సోనియా గాంధీకి అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక
దీనిపై నియమించిన కమిటీ ఆగస్టు 6న సీఎంకు తన నివేదికను సమర్పించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో లవ్ జిహాద్ ను అరికట్టేందుకు బిల్లులో కొన్ని అంశాలను జోడిస్తామని సీఎం పేర్కొన్నారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) ఉపసంహరణ అంశంపై మాట్లాడుతూ దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని ఉపసంహరించాలా..? వద్దా..? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనిపై ఈ నెలలో కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని నెలాఖరులో ఖచ్చితమైన నిర్ణయం వస్తుందని బిశ్వసర్మ అన్నారు.
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!