Curd Health Benefits: పెరుగు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు, వైద్యులు తరుచుగా చెబుతుంటారు. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా, విటమిన్లు, మినరల్స్ కలిసి ఉంటాయి. కడుపులోని యాసిడ్ స్థాయిలను సమతుల్యత కాపాడుకోవడానికి సహాయపడుతుంది. పోషకాలు నిండుగా ఉండే ఆహారపదార్థం పెరుగు. ప్రతిరోజూ పెరుగును తీసుకుంటే లాక్టోబాసిల్లస్, లక్టోకోకస్, స్ట్రప్టోకోకస్ వంటి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు మన శరీరానికి ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగపడుతాయి.
పేగుల వాపు, బరువుపెరుగుట, ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెరుగు తగ్గిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం పెరుగు బ్యూటిరేట్ అని పిలువబడే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని పెంచుతుంది. బిలోఫిలా వాస్ట్‌వర్టియా అనే చెడు బ్యాక్టీరియాలో గణమైన తగ్గుదల ఉంటుంది. ‘ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్’ వ్యాధి రాకుండా సహాయపడుతుంది.
పెరుగులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యంలో పెరుగు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలాన్ని పెంపొందించడానికి ఇవి సహకరిస్తాయి. క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు విరుగుళ్లను, ఆర్థరైటిస్, ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులు రాకుండా చూస్తుంది.
Read Also: Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. సిద్ధమవుతున్న ఇస్రో
పెరుగు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో కొవ్వు పదార్థాలు ఉన్నప్పటికీ పెరుగులోని మంచి కొవ్వులు గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది. గుండె జబ్బులు తగ్గించేందుకు పెరుగు సహకరిస్తుంది.
పెరుగు శరీర బరువు పెరగకుండా సహకరిస్తుంది. దీనిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత, గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని వల్ల షుగర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయతే చాలా మంది కొవ్వులు అధికంగా లేిని, తీపి తక్కువగా ఉంటే పెరుగు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల బరువు పెరగకుండా, మలబద్ధకం లేకుండా ఉంటుందని చెబుతున్నారు.