Aditya L1 Solar Mission: “ఆదిత్య ఎల్1” తొలి విన్యాసం విజయవంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya L1 Solar Mission: చంద్రయాన్-3 విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిన్న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 శాటిలైన్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం శాటిలైట్ భూమి దిగువ కక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో తిరుగుతోంది. దశల వారీగా కక్ష్యను పెంచుకుంటూ గమ్యస్థానం వైపు వెళ్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఆదిత్య ఎల్ 1 తొలి భూసంబంధిత విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఆదిత్య ఎల్1 బాగా పనిచేస్తుందని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం ఆదిత్య ఎల్1 245 కి.మీ x 22459 కి.మీ కక్ష్యలో తిరుగుతోంది. తర్వాతి కక్ష్య పెంపు సెప్టెంబర్ 5 ఉంటుందని ఇస్రో ప్రకటించింది.
Also Read
Read Also: Assam: “బహుభార్యత్వం”పై హిమంత ఉక్కుపాదం.. అసెంబ్లీలో బిల్లుకు సిద్ధం..
ఈ విన్యాసాల్లో ఆదిత్య ఎల్1లోని ఆన్‌బోర్డ్ ఇంజన్లను నిర్ణీత సమయం పాటు మండించి కక్ష్యను పెంచడం, శాటిలైట్ కోణాన్ని సరిచేయడం వంటివి చేస్తుంటారు. భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడేందుకు స్పేస్ క్రాప్ట్ ఆర్బిట్ ను పలు దశల్లో పెంచుతుంటారు. ఆ తరువాత దీనికి తగిన వేగం రావడంతో భూ ఆకర్షణ నుంచి బయటపడి లక్ష్యం దిశగా వెళ్తుంది.
ఆదిత్య ఎల్1 భూమి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రేజ్ పాయింట్(L1)కి చేరాల్చి ఉంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పాయింట్ వద్దకు చేరడానికి ఆదిత్య ఎల్1కి 125 రోజులు (4నెలల) సమయం పడుతుంది. ఎల్1 పాయింట్ వద్ద భూమి, సూర్యుడి మధ్య గురుత్వాకర్షణ శక్తులు సమతుల్యంగా ఉంటాయి. ఈ పాయింట్ వద్ద శాటిలైట్ స్థిరంగా హలో కక్ష్యలో తిరుగుతుంటుంది. సూర్యుడి కరోనా, సౌర తుఫానులు, మాగ్నటిక్ ఫీల్డ్ వంటి వాటిని ఆదిత్య ఎల్1 అధ్యయనం చేస్తుంది.
Aditya-L1 Mission:
The satellite is healthy and operating nominally.The first Earth-bound maneuvre (EBN#1) is performed successfully from ISTRAC, Bengaluru. The new orbit attained is 245km x 22459 km.
The next maneuvre (EBN#2) is scheduled for September 5, 2023, around 03:00… pic.twitter.com/sYxFzJF5Oq
— ISRO (@isro) September 3, 2023
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?