Supreme Court: అత్తమామాలపై ఒక మహిళ దాఖలు చేసిన వరకట్న వేధింపుల కేసును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సదరు మహిళ తన అత్తామమాలపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేసిందని వ్యాఖ్యానించింది. మహిళ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని కొనసాగించడం అన్యాయానికి దారి తీస్తుందని పేర్కొంది.
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్ఠాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ, పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే తాను ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి వివరణ ఇచ్చుకుంటున్నారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని ఆరోపించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ […]
Honda Elevate: జపనీస్ కార్ మేకర్ హోండా ఎంతో ప్రతిష్టాత్మకంగా కాాంపాక్ట్ SUV సెగ్మెంట్లో తన ఎలివేట్ కారును తీసుకొస్తోంది. రేపు హోండా ఎలివేట్ లాంచ్ కాబోతోంది.
Solar Storm: సూర్యుడి నుంచి వెలువడిన సౌరతుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని Spaceweather.com నివేదించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) భూవాతావరణంపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. సూర్యుడిపై భారీ విస్పోటనాల తర్వాత ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడుతుంటాయి. ఇవి విశ్వంలో ప్రయాణిస్తుంటాయి.
COVID-19: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 పీడ విరగడయ్యేలా కనిపించడం లేదు. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. BA.2.86 లేదా పిరోలా అనే కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది.. అమెరికా, యూకే, చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పిరోలా వేరియంట్ ఇజ్రాయిల్, కెనడా, డెన్మార్క్, […]
Kumara Swamy: ఇటీవల ప్ట్రోక్కి గురైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కోలుకున్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇది తనకు మూడో పునర్జన్మ అని అన్నారు. తనకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడికి, చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Rahul Gandhi: దేశవ్యాప్తంగా ప్రస్తుతం రాజకీయాలు అన్నీ ముందుస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారనే చర్చ మొదలైంది. దీనికి అనుగుణంగానే కేంద్రం మాజీ రాష్ట్రపతితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఒకే దేశం-ఒకే ఎన్నికపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇండియా కూటమికి భయపడే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. […]
Amit Shah: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు తమిళనాడుతో మొదలు దేశంలోని నాయకులు డీఎంకే, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని ద్వేషిస్తోందని, అది మన వారసత్వంపై […]
Manipur: జాతలు మధ్య ఘర్షణతో మణిపూర్ అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ జాతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో మయన్మార్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన పారాకమాండోకు కీలక బాధ్యతను అప్పచెప్పింది. ప్రస్తుతం ఆయన రిటైల్ అయినా మణిపూర్లో పరిస్థితి శాంతిని నెలకొల్పేందుకు ఈ రిటైర్ ఆర్మీ అధికారి సాయం తీసుకుంటున్నారు.
Early Elections: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడంతో ఒక్కసారి జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా విపక్షాలు ఇండియా కూటమిలోని పార్టీలు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని అంచనా వేస్తున్నాయి. సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.