Venu Goapl Reddy
Author- NTV Telugu-
PM Surya Ghar Muft Bijli Yojana: సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కుటుంబానికి రూ. 78,000.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..
PM Surya Ghar Muft Bijli Yojana: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా సోలార్ ప్యానెల్ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ యోజన కింద సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ. 78,000లను అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. -
Sheikh Shahjahan: సందేశ్‌ఖలి నిందితుడు షేక్ షాజహాన్‌పై తృణమూల్ సస్పెన్షన్ వేటు..
Sheikh Shahjahan: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్‌పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పదుల సంఖ్యలో కేసులు ఉండటంతో పాటు ఇటీవల సందేశ్‌ఖలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు అక్కడి ప్రజలు ఉద్యమించారు. -
India at UN: “ముందు మీరు మీ మైనారిటీలను చూసుకోండి”.. పాకిస్తాన్‌పై భారత్ ధ్వజం..
India at UN: పాకిస్తాన్ తీరు మారడం లేదు. కుక్క తోక వంకర అనేలా ప్రపంచవేదికలపై భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. అయితే, భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ ధీటుగా పాకిస్తాన్‌కి కౌంటర్ ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌కి ఎలాంటి అధికారం లేదని చెప్పింది. -
1993 Train blasts: 1993 రైలు పేలుళ్ల ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..
1993 Train blasts: 1993 రైలు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లష్కర్ తోయిబా ఉగ్ర సంస్థ బాంబు తయారీదారు అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నేడు నిర్దోషిగా ప్రకటించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత గడిచి సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో పలు రైళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, తుండాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని పేర్కొన్న కోర్టు, ఇద్దరు నిందితులు అమీనుద్దీన్, ఇర్ఫాన్లను దోషులుగా నిర్ధారించి వారికి జీవిత… -
Congress: హిమాచల్ చేజారితే.. ఈ రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్‌కి దిక్కు..
Congress: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఒక్క రాజ్యసభ ఎంపీని గెలిపించుకోలేకపోయింది. బీజేపీ పార్టీకి 25 ఎమ్మెల్యేలు ఉండగా.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో బీజేపీ రాజ్యసభ స్థానాన్ని కైవసం… -
Uttar Pradesh: ప్రభుత్వ స్కీమ్ పొందేందుకు భర్తనే మార్చేసింది.. వేరే వ్యక్తితో పెళ్లి తంతు..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువతి నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న పథకం యొక్క ప్రయోజనాలు పొందేందుకు ఏకంగా భర్తనే మార్చేసింది. తనను పెళ్లి చేసుకోవాల్సిన వరుడు రాకపోవడంతో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం ప్రయోజనాలను పొందేందుకు సదరు మహిళ తన బంధువుల అబ్బాయితో వివాహ లాంఛనాలను పూర్తి చేసింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ ప్రారంభించారు. ఝాన్సీలో మంగళవారం 132 జంటలకు జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
Jammu Kashmir: కాశ్మీర్‌లోని “ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాల”పై నిషేధం ప్రకటించిన అమిత్ షా..
Jammu Kashmir: ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్‌కి చెందిన రెండు ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాలపై కేంద్రం నిషేధం విధించింది. ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (సుమ్జీ వర్గం), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ & కాశ్మీర్ (భాట్ వర్గం)లను బుధవారం నిషేధిత గ్రూపులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కృతనిశ్చయంతో ఉందని, ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమిత్ షా హెచ్చరించారు. -
Karnataka: “బీజేపీకి పాకిస్తాన్ శత్రు దేశం, మాకు కాదు”.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాల రచ్చ నడుస్తోంది. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ మద్దతుదారులు పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇది నిజమని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ఆరోపణల్ని కొట్టిపారేశారు. -
Political parties income: పొలిటికల్ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్.. 6 జాతీయ పార్టీ వివరాలు..
Political parties income: కేంద్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఆదాయం పరంగా టాప్ ప్లేస్‌లో ఉంది. దేశంలో ఉన్న 6 జాతీయ పార్టీల ఆదాయాలను బట్టి చూస్తే ఎవరికి అందనంత ఎత్తులో కాషాయ పార్టీ నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6 జాతీయ పార్టీలకు రూ. 3077 కోట్ల ఆదాయం వస్తే.. బీజేపీ ఏకంగా 76.77 శాతంతో రూ. 2361 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఉటంకిస్తూ.. అసోసియేషన్ ఫర్ డిమెక్రాటిక్ రిఫార్మ్స్(ADR) బుధవారం… -
Mahindra Thar Earth edition: మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ లాంచ్.. బండి మామూలుగా లేదుగా..
Mahindra Thar Earth edition: ఇండియాలో ఆఫ్ రోడ్ వాహనాల్లో మహీంద్రా థార్‌కి ఉన్న క్రేజే వేరు. వేరే కార్ మేకర్ కంపెనీల నుంచి పలు రకాల ఆఫ్ రోడర్లు వచ్చినప్పటికీ థార్‌కి ఉన్న ఆదరణ మాత్రం నానాటికి పెరుగుతోంది. తాజాగా థార్ కొత్త అవతార్‌లో వస్తోంది.
తాజావార్తలు
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!