Roshini App: ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అంటారు. మనకు ఉన్న ఇంద్రియాల్లో కళ్లు చాలా ముఖ్యమని భావిస్తారు. అయితే చాలా వరకు కంటి జబ్బుల్ని ముందు దశల్లో గుర్తిస్తే చికిత్స చాలా సులభం ఉంటుంది. ముఖ్యంగా కంటి శుక్లాలను ( క్యాటరాక్ట్) కామన్ గా కనినిపించే కంటి జబ్బు. దీనిని తొలిదశల్లో గుర్తించేందుకు లక్నోకు చెందిన ఓ టీనేజర్ ఏకంగా ఓ యాప్ ని కనిపెట్టాడు.
Read Also: IND vs NEP: భారత్‌తో మ్యాచ్.. నేపాల్ ఆటగాళ్లకు బంపరాఫర్!
17 ఏళ్ల ఇషాన్ వసంత్ కుమార్ కంటి శుక్లాలను తొలిదశలో గుర్తించేందుకు AI అధారిత యాప్ ‘రోషిణి’ని అభివృద్ధి చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ టెక్నికల్ సపోర్ట్ యూనిటి, స్టడీ హాల్ శనివరాం నిర్వహించిన ఉచిత కంటి తనిఖీ శిబిరాల్లో ఈ యాప్ ని ప్రవేశపెట్టారు. స్టడీ హాల్ స్కూల్ లో 12 తరగతి చదువుతున్న వసంత్ కుమార్ ఈ యాప్ ని నేషనల్ హెల్త్ మిషన్, ఇండియా హెల్త్ యాక్షన్ ట్రస్ట్ తో కలిసి, సంవత్సరం శ్రమించి రూపొందించాడు.
దీని ద్వారా ప్రజలకు తొలిదశలో కంటి శుక్లాలను నిర్థారించవచ్చు. క్యాటరాక్ట్ వల్ల వచ్చే అంధత్వాన్ని నివారించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు ఈ యాప్ అందుబాటులో ఉండననుంది. మొదటగా వారణాసి, ఫతేపూర్, హావూర్ లలో ఈ యాప్ ఉపయోగించనున్నారు. ఇలాంటి యాప్ భారతదేశంలో ఇప్పటి వరకు అందుబాటులో లేదని వసంత్ కుమార్ అన్నారు. మా తాతయ్యలకు ఇద్దరికి కంటిశుక్లం నిర్థారణ అయిందని, ఇదే ఆ యాప్ తయారు చేసేందుకు ప్రేరేపించిందని అతను చెప్పాడు.