Youtube: యూట్యూబ్‌కి ఎసరు పెడుతున్న “యూట్యూబ్ షార్ట్స్”.. కోట్ల వ్యాపారంపై ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtube: టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌కు పోటీగా యూట్యూబ్ తీసుకువచ్చిన షార్ట్ వీడియోస్ ‘యూట్యూబ్ షార్ట్స్’ అనతి కాలంలోనే చాలా ఆదరణ పొందాయి. అయితే ఇది యూట్యూబ్ వ్యాపారాన్నే దెబ్బతీసేలా తయారైంది. కోట్లాది రూపాయల వ్యాపారాని ఈ షార్ట్స్ గండికొడుతున్నాయిని ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. 2020లో భారతదేశంలో యూట్యూబ్ షార్ట్స్ అనే షార్ట్ వీడియో ఫీచర్నిని ప్రవేశపెట్టింది. ఆ తరువాత 2021లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ ఫీచర్ విపరీతమైన ఆదరణ పొందింది.
అనతికాలంలోనే మంచి రెస్పాన్స్ రావడంతో సంస్థ ఆదాయం పెరుగుతుందని భావించింది. అయితే కాలక్రమంలో దీని వల్ల సంస్థకు ప్రధాన ఆదాయంగా ఉన్న లాంగ్ వీడియోలపై ప్రభావం పడుతోందని యూట్యూబ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. షార్ట్ వీడియోల వల్ల లాంగ్ వీడియోల వ్యాపారానికి ప్రమాదం తెస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి.
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
Read Also: Viral Video: అతి తెలివి చూపిన ఆటో డ్రైవర్.. తిక్క కుదిర్చిన పోలీసులు
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పరిచయం చేసిన తర్వాత యూట్యూబ్ కూడా షార్ట్స్ ప్రారంభించింది. ఇది ప్రారంభం అయిన తర్వాత ప్రేక్షకుల జనాదరణ పొందింది. యూట్యూబ్ ఆదాయం ప్రకటన నుంచే వస్తుంది. ఈ ప్రకటనలు లాంగ్ వీడియోలోనే ఉంటాయి. షార్ట్ వీడియోల్లో ప్రకటనలను అనుమతించదు. ప్రేక్షకులు కూడా షార్ట్ వీడియోలకు ఎక్కువగా అలవాటు పడటం, దీంతో ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది తమ కంటెంట్ ని షార్ట్ వీడియోల రూపంలో అప్‌లోడ్ చేస్తున్నారు.
2020లో తొలిసారి తన త్రైమాసిక క్షీణతను చూసింది. తరువాత త్రైమాసికాల్లో కూడా మునుపటి కాలంతో పోలిస్తే క్షీణతను చవిచూసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత ఆదరణ పొందిన యూట్యూబ్ షార్ట్స్ ని సంస్థ తీసేసే అవకాశం లేదు. అయితే రాబడి కోసం యూట్యూబ్ ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషించే అవకాశం లేకపోలేదని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?