Harish Salve: 68 ఏళ్ల వయసులో మాజీ సొలిసిటర్ జనరల్ మూడోసారి పెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Salve: భారతదేశంలో టాప్ లాయర్, మాజీ సొలిసిటర్ జనరల్ గా పనిచేసిన హరీష్ సాల్వే మూడోసారి వివాహం చేసుకున్నారు. 68 ఏళ్ల సాల్వే, త్రినా అనే మహిళను పెళ్లాడారు. అంతకుముందు ఆయనకు రెండుసార్లు వివాహం జరిగింది. మొదటగా హరీష్ సాల్వే మీనాక్షిని వివాహమాడగా.. 2020లో కరోలిన్ బ్రస్సార్డ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. మీనాక్షితో దాదాపుగా 3 దశాబ్దాల వివాహబంధానికి 2020లో ముగింపుపలికి విడాకులు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు.
ప్రస్తుతం సాల్వే త్రినాను పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. లండన్ లో జరిగిన ఈ వివాహ వేడుకలకు నీతా అంబానీ, లలిత్ మోడీ, ఉజ్వల్ రౌత్ వంటి ప్రముఖులు హాజరైనట్లుగా తెలుస్తోంది.
Also Read
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
హరీష్ సాల్వే దేశంలో ప్రముఖమైన కేసులకు న్యాయవాదిగా వ్యవహరించారు. గూఢచర్యం కేసులో పాకిస్తాన్ లో అరెస్టైన కులభూషన్ జాదవ్ కేసును న్యాయవాదిగా ఉన్నారు. జాదవ్ కు పాక్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసు ప్రస్తుతం ఇంటర్నేషన్ కోర్టులో ఉంది. ఈ కేసుకు గానూ సాల్వే కేవలం రూ. 1 మాత్రమే లీగల్ ఫీజుగా తీసుకోవడం ప్రశంసలను అందుకుంది.
Read Also: Supreme Court: “అత్తమామాలపై ప్రతీకారం కోసమే”.. వరకట్న వేధింపుల కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు..
టాటా గ్రూప్, ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి వారు సాల్వేకు క్లయింట్స్ గా ఉన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ పై కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం కేసును కూడా ఈయన వాదించారు. భారత ప్రభుత్వం 2015లో హరీష్ సాల్వేకు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ భూషణ్’ని ప్రకటించింది. 2002లో సల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసును కూడా సాల్వేనే వాదిస్తున్నారు.
2018లో కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. నవంబర్ 1999 నుండి నవంబర్ 2002 వరకు భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన సాల్వే జనవరిలో వేల్స్ మరియు ఇంగ్లాండ్ కోర్టులకు క్వీన్స్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సాల్వే నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 1992లో భారత సొలిసిటర్ జనరల్ గా నియమించడానికి ముందు ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు.
Former Solicitor general of India, #HarishSalve got married for the 3rd time. Nita Ambani, Lalit Modi amongst others attended the ceremony.
Hopefully he is lucky the third time. pic.twitter.com/RVSPXyTujC
— Kumar Mihir Mishra (@Mihirlawyer) September 4, 2023
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!