Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ మరో ఘనత.. రెండోసారి చందమామపై ల్యాండింగ్.. ఇస్రో కొత్త వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 విజయవంతమైన చాలా రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ మరో ఘనత సాధించింది. చంద్రుడి ఉపరితలంపై నుంచి పైకి ఎగిరి రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.
ఇటీవల ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిన దక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండైన ప్రదేశానికి ‘శివశక్తి’ పాయింట్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ సమయంలో ల్యాండ్ అయిన ప్రదేశం నుంచి 40 సెంటీమీటర్ల మేర పైకి లేకి, 30-40 సెంటీమీటర్ల దూరంలో మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో వెల్లడించింది. బెంగళూర్ లోని కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు అందుకున్న విక్రమ్ తన ఇంజన్లను మండించి సురక్షితంగా పైకి ఎగిరి సేఫ్ ప్లేస్ లో ల్యాండ్ అయింది.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
Read Also: Harish Salve: 68 ఏళ్ల వయసులో మాజీ సొలిసిటర్ జనరల్ మూడోసారి పెళ్లి..
భవిష్యత్తులో చంద్రుడిపై నుంచి నమూనాలను తీసుకురావడం, మానవులను సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం వంటి మిషన్లలో ఇలాంటి ప్రయోగం కీలకంగా ఉంటుందని ఇస్రో తెలిపింది. తాజాగా నిర్వహించిన ప్రయోగం తర్వాత విక్రమ్ ల్యాండర్ లోని అన్ని పేలోడ్లు సురక్షితంగా, హెల్తీగా ఉన్నాయని ఇస్రో వెల్లడించింది.
ఇటీవల చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయింది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. చంద్రయాన్-3తో వెళ్లిన రష్యా ‘లూనా-25’ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. చంద్రయాన్-3 మిషన్ వల్ల దక్షిణ ధృవంపై ఆక్సిజన్, సల్ఫర్ ఉన్నట్లు తేలింది.
Chandrayaan-3 Mission:
🇮🇳Vikram soft-landed on 🌖, again!Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.
On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI
— ISRO (@isro) September 4, 2023
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!