Khalistan Referendum: ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఎదురుదెబ్బ.. రెఫరెండానికి కెనడా అనుమతి నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan Referendum: ‘ఖలిస్తాన్’ పేరుతో భారత్ పై ఖలిస్తానీవాదులు విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని కొంతమంది ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కెనడా వ్యాప్తంగా ఖలిస్తాని మద్దతుదారులు ‘ఖలిస్తాన్ రెఫరెండం’ పేరుతో నానా హంగామా సృష్టిస్తున్నారు. భారత్ నుంచి పంజాబ్ విడగొట్టి ఖలిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఖలిస్తాన్ రెఫరెండంపై ఓటింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. ముఖ్యంగా ఏకే-47 పోస్టర్లతో ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రచారం చేసిన కారణంగా అనుమతి నిరాకరించారు అక్కడి అధికారులు. ఖలిస్తాన్ రెఫరెండం కోసం కెనడా భూభాగాన్ని వినియోగించడంపై భారత్ పలుమార్లు తన అసహనం వ్యక్తం చేసింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Read Also: G20 Summit: జీ20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు.. ప్రీమియర్ వస్తారని స్పష్టం చేసిన చైనా
ఏకే-47 మెషిన్ గన్ పోస్టర్లు, కిర్పాన్‌లతో కూడిన ప్రచార చిత్రాలు ఉండటంతో ఒప్పందాన్ని ఉల్లంఘించారని చెబుతూ అనుమతి రద్దు చేసినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. చాలా సార్లు ఈ పోస్టర్లను తీసేయాలని చెప్పినప్పటికీ నిర్వాహకులు వీటిని తీసేయకపోవడంతోనే అనుమతి నిరాకరించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ కెనడా , ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు మణిందర్ గిల్ స్వాగతించారు.
ఏకే-47 పోస్టర్లే కాకుండా జూన్ 23, 1985న 329 మంది ప్రయాణికులను బలిగొన్న ఎయిరిండియా ఫ్లైట్ 182 కనిష్కపై ఉగ్రవాద దాడిలో కీలకంగా ఉన్న తల్వీందర్ సింగ్ పోస్టర్లను కూడా అంటించారు. అయితే ఈ రెఫరెండం క్యాన్సిల్ కావడంతో కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించలేదు. సిక్కు వేర్పాటువాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సెప్టెంబర్ 8న వాంకోవర్ లోని ఇండియన్ కాన్సులేట్ ‘లాక్ డౌన్’కి ఖలిస్తాన్ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!