Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో భాగంలో బెల్జియంలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు ఆయన యూరప్ లో పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్ సభ్యులను, ప్రవాసభారతీయులను, పలువురు వ్యాపారవేత్తలను ఆయన కలవనున్నారు. రాహుల్ గాంధీతో పాటు శ్యామ్ పెట్రోడా కూడా ఈ పర్యటనలో ఉన్నారు. యూరప్ చివర్లో ఆయన నార్వేలో పర్యటించనున్నారు. ఓస్టోలో అక్కడి పార్లమెంటేరియన్ సభ్యులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Harassment: మస్కట్-ఢాకా విమానం ముంబై మీదుగా ప్రయణిస్తున్న క్రమంలో ఓ బంగ్లాదేశీ ప్రయాణికులు మహిళా ఫ్లైట్ అంటెండెంట్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 30 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రయాణికుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Manipur Violence: గత నాలుగు నెలలు మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. శాంతి నెలకొంటుందనుకునే సందర్భంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మణిపూర్ లో టెన్షన్ వాతావరణం తలెత్తింది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. తెంగ్నౌపాల్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
G20 Summit: పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు అగ్రదేశం అమెరికా, భారత్ పావులు కదుపుతున్నాయి. రైల్, ఓడరేవుల మెగా డీల్‌పై అమెరికా, సౌదీ అరేబియా, భారత్, ఇతర దేశాలు చర్చలు జరుపుతున్నట్టు రాయిటర్స్ శుక్రవారం ప్రకటించింది. దీనిపై అమెరికన్ న్యూస్ లెటర్ ఆక్సియోస్ కథనాన్ని నివేదించింది.
G20 Dinner: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 దేశాధినేతలకు శనివారం విందు ఇవ్వనున్నారు. అయితే ఈ విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా కలిగిని ఖర్గేకు ఆహ్వానించలేదు. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అతిథులకు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులైన డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడ కూడా అతిథుల లిస్టులో ఉన్నారు.
బాధితురాలిని ఆమె స్నేహితురాలు ఓ హోటల్ కి రమ్మని పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను బీఫార్మ్ విద్యార్థి షోయబ్, బార్బర్ గా పనిచేస్తున్న నజీమ్ గా గుర్తించారు. ఈ మొత్తం అత్యాచార ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిందితులు, బాధిత మహిళను బ్లాక్మెయిల్ చేశారు.
PM Modi-Biden Meet:ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్9-10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. జీ20 సభ్యదేశాలతో పాటు మొత్తం 30 దేశాధినేతలు, పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సమావేశాలకు
Yogi Adityanath: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. దీనికి తోడు మరికొంత మంది డీఎంకే నాయకులు ఉదయనిధికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో
G20 Summit: జీ20 సమావేశాలకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తామైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ ఈవెంట్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్9-10 తేదీల్లో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో పాల్గొంటున్న 15 దేశాల నాయకులతో ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ఈ భేటీలు జరగబోతున్నాయి.
BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు పార్టీలు…