Annamalai: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. చివరకు ఆయన తండ్రి, సీఎం స్టాలిన్ కూడా కొడుకు వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు డీఎంకే పార్టీతో పాటు ఆ పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో డీఎంకేని, కాంగ్రెస్, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తోంది. ఇండియా కూటమి హిందుమతానికి ద్వేషిస్తోందని బీజేపీ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
China: భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో అగ్రదేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే భారతదేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న పలుకుబడిని చూసి డ్రాగన్ కంట్రీ చైనా తట్టుకోలేకపోతోంది. చైనా తన మౌత్‌పీస్ పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ ద్వారా భారతదేశంపై విషాన్ని చిమ్మే కథనాలను ప్రచురిస్తోంది. భారతదేశం అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకునేందకు జీ20 సదస్సును ఉపయోగించుకుంటుందని వ్యాఖ్యానించింది.
Rahul Gandhi: దేశంలో ఓ వైపు ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు మందు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ యూరప్ పర్యటకు వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన వివిధ దేశాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ఆయన బ్రస్సెల్స్ చేరుకున్నారు. అక్కడి ప్రవాస భారతీయులతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు, న్యాయవాదులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారు.
Husband's gift to wife: భార్యకు పెళ్లి మందు చేసి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు భర్త ఏకంగా చంద్రుడిపై భూమినే కొనుగోలు చేశాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఝర్గ్రామ్ జిల్లాకు చెందిన వ్యక్తి భార్య పుట్టిన రోజు చంద్రుడిపై భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఒక ఎకరం భూమిని రూ. 10,000లకు కొనుగోలు చేసిన సంజయ్ మహతో తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. పెళ్లికి ముందు తన భార్యకు చంద్రుడిని తీసుకువస్తానని హామీ ఇచ్చినందకు ఇలా చంద్రుడిని గిఫ్ట్ గా ఇచ్చాడు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన వివాహేతర సంబంధాన్ని దాచిపెట్టేందుకు ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. మూడేళ్ల కన్న కొడుకును డాబాపై నుంచి తోసేసి చంపేసింది.
China: డ్రాగన్ కంట్రీలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మానవహక్కులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిందే చట్టం, చెప్పందే వేదం. దేశాన్ని విమర్శించినా, కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన ప్రజలు మాయమవుతుంటారు. లేకపోతే జైళ్లలోకి వెళ్తుంటారు. అలాంటి చైనా కొత్తగా మరో చట్టాన్ని తీసుకురాబోతోంది.
COVID-19: గత మూడేళ్లుగా కోవిడ్-19 ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పూర్తిస్థాయిలో కంట్రోల్ కావడం లేదు. ఇదిలా ఉంటే కోవడ్ సోకిన వారిని దీర్ఘకాలం సైడ్ ఎఫెక్టులతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే థాయ్‌లాండ్ లో కోవిడ్ చికిత్స తర్వాత ఓ చిన్నారి కళ్ల రంగు పూర్తిగా మారిపోయింది.
Vivek Ramaswamy: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉంది. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ లాంటి భారతీయ అమెరికన్లు అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా సంచలన ప్రకటన చేశారు. 2020లో ట్రంప్ ఓడిపోయిన సమయంలో యూఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తానంటూ హామీ ఇచ్చారు.
MK Stalin: తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన ‘సనాతన’ వ్యాఖ్యలు దేశంలో దుమారాన్ని రేపాయి. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమిలోని టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు నేరుగా ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించకుండా, ప్రతీ మతాన్ని గౌరవించాలని చెబుతున్నాయి.
Aditya-L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ దిగ్విజయంగా తన లక్ష్యం వైపు కదులుతోంది. సూర్యుడిపై పరిశోధనలకు చేయడానికి ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. తాజాగా ఆదిత్య ఎల్1 ఆన్ బోర్డ్ కెమెరాల సాయంతో సెల్ఫీ తీసింది. దీంతో భూమి, చంద్రుడు కనిపించడం చూడొచ్చు. చంద్రుడు భూమికి కుడి వైపున చిన్న చుక్కలా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది.