G20 Summit: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహించింది. జీ 20 సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అధ్యక్షుడు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా ఈ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని ట్రూడో వంటి అగ్రనేతలు సమావేశాలకు వచ్చారు. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్ పింగ్ మాత్రం ఈ సమావేశాలకు హాజరుకాలేదు.
Rio G20 meet: నేటిలో భారత్ నిర్వహిస్తున్న జీ20 సమావేశాలు పూర్తవుతున్నాయి. వచ్చే ఏడాది బ్రెజిట్ రియో డి జనీరోలో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే భారత్ నిర్వహించిన సమావేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకాలేదు. ఆయన స్థానంలో ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బ్రెజిల్ నిర్వహిస్తున్న జీ 20 సమావేశాలకు పుతిన్ వస్తారా..? అని ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాని మీడియా ప్రశ్నించిన సమయంలో కీలక…
Joe Biden: భారత్ జీ20 సమావేశాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. విదేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా కీలక వ్యక్తులు ఢిల్లీకి వచ్చారు. ముఖ్యంగా అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు భారీ సెక్యూరిటీ ఇస్తున్నారు. సీఐఏతో పాటు భారతదేశ సెక్యూరిటీ విభాగం అడుగడుగున ప్రెసిడెంట్ భద్రతను పర్యవేక్షిస్తోంది. ఇంత సెక్యూరిటీ ఉండే బైడెన్ కాన్వాయ్ లో ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రోటోకాల్‌ని ఉల్లంఘించారు. ఈ ఘటన శనివారం ఢిల్లీలో జరిగింది.
G20 Summit: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. భారత్ ఇస్తున్న ఆతిథ్యానికి ప్రపంచ దేశాధినేతలు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే భారత్ జీ20 నిర్వహిస్తుండటంపై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా మరోసారి భారతదేశంపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా థింక్ ట్యాంక్ భారతదేశం తన సొంత ఎజెండాను ప్రచారం చేయడానికి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగించడానికి జీ20 అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటోందని ఆరోపించింది.
Tata Nexon.ev Facelift: టాటా తన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను లాంచ్ చేసింది. గతంలో పోలిస్తే టెక్ లోడెడ్ ఫీచర్లతో, మోర్ అట్రాక్షన్ తో మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఇదే విధంగా టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా అంతే స్టైలిష్ లుక్స్‌తో, మోర్ ఫీచర్లతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో నెక్సాన్ రారాజుగా ఉంటే, ఇదే విధంగా ev కార్ల అమ్మకాల్లో నెక్సాన్ ఈవీ టాప్ పొజీషన్ లో ఉంది.
G20 Summit: జీ20 సమావేశాలకు దేశాధినేతలు తరలివస్తున్నారు. ఒక్కొక్కరుగా దేశాధినేతలు, కీలక వ్యక్తులు న్యూఢిల్లీకి చేరుకుంటుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీకి చేరుకున్నారు
Russia-Ukraine War: గత ఏడాదిన్నరగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే రష్యా, ఉక్రెయిన్ కు రెండిన తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు అక్కడ ఎన్నికలు నిర్వహింస్తోంది రష్యా. డోనెట్స్క్, లూహాన్స్క్, ఖేర్సన్, జపొరిజ్జియా ప్రాంతాల్లో రష్యా శుక్రవారం ఎన్నికలను ప్రారంభించింది. ఆదివారంతో ఇవి ముగియనున్నాయి. ఇదిలా ఉంటే రష్యా చర్యను వెస్ట్రన్ దేశాలు ఖండిస్తున్నాయి.
Rahul Gandhi: యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇండియా-భారత్ వివాదంపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి భయంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆయన ఆరోపించారు
G20 Dinner: భారత్ ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. దాదాపుగా 30కి పైగా దేశాధినేతలు ఈ సమాశాలకు హాజరవుతున్నారు. వివిధ దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు.
Oxygen on Mars: అంగారక గ్రహంపైకి 2021లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పంపిన పర్సెవెరెన్స్ రోవర్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే అక్కడి వాతావరణం, మట్టి నమూనాలను విశ్లేషిస్తున్న ఈ రోవర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దీంతో వెళ్లిన బుల్లి హెలికాప్టర్ కూడా అక్కడి వాతావరణంలో పలుమార్లు పైకి ఎగిరింది.