Udayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఉదయనిధి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో, ఆ కూటమికి హిందూమతంపై ద్వేషం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Siddaramaiah: సనాతన ధర్మపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉదయనిధిపై విమర్శలు చేస్తోంది. ఈ వివాదం ముగియకముందే మరో వివాదానికి తెరలేపారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేరళలోని హిందూ దేవాలయలంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.
Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు మతమార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసింది. పవిత్ర బైబిల్ గ్రంథాన్ని పంచిపెట్టడం, మంచి బోధనలను అందించడం మతమార్పిడికి ఆకర్షితం చేయడం కాదని అలహాబాద్ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అపరిచిత వ్యక్తి ఈ చట్టంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని హైకోర్ట్ పేర్కొంది.
'Bharat' controversy: ‘ఇండియా’ పేరు ‘భారత్’గా మారుస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పెడతారని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) స్పందించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాన్ హక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల పేర్లు మార్చుకోవాలని ఆ దేశాలు అనుకున్నప్పుడు యూఎన్ వాటిని పరిగణలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు.
Mohan Bhagwat: రాష్ట్రీక స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఉందని, అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని బుధవారం ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశం ఆయన మాట్లాడారు. 1947లో భారతదేశంతో విడిపోయిన వారు తాము తప్పు చేస్తున్నామని భావిస్తున్న తరుణంలో నేటి యువకులు వృద్ధులుగా మారకముందే ‘అఖండ భారత్’, అవిభాజ్య భారతదేశం సాకారం అవుతుందని ఆయన అన్నారు.
MG Astor Blackstorm: పండగ సీజన్ వస్తుండటంతో అన్ని కార్ కంపెనీలు తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఎడిషన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మోరిస్ గారేజ్(ఎంజీ) కూడా కొత్త కారుతో మార్కెట్ లోకి తీసుకువస్తోంది.
Volvo C40 Recharge: స్వీడన్ ఆటోమేకర్ వోల్వో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వోల్వో C40 రీఛార్జ్ కారును లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ రెండో ఎలక్ట్రిక్ ఎస్యూవీ అంతకుముందు వోల్వో నుంచి XC40 రీఛార్జ్ ఉంది. ఇండియా కార్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో అన్ని
Moon Mission: చంద్రుడిపై అన్ని దేశాలు తమ దృష్టిని సారిస్తున్నాయి. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహంపై భవిష్యత్తులో మానవ నివాసాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. రాబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లో ప
PM Modi: తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ తాము అన్ని మతాలను సమానం చూస్తామని ప్రకటించింది.
Lalu Prasad Yadav: ప్రస్తుతం దేశంలో భారత్ వర్సెస్ ఇండియాగా వ్యవహారం నడుస్తోంది. కేంద్రం ఇండియా పేరును భారత్ గా మారుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జీ20 సమావేశాల్లో దేశాధినేతలకు విందు ఇచ్చే ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం, ఇదే విధంగా ప్రధాని ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన నోట్ లో కూడా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది.