African Union Chairperson: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఈ రోజు ముగిశాయి. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా ప్రీమియర్ లీ కియాంగ్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటి పలువురు దేశాధినేతుల, ఇతర సంస్థల అధికారులు న్యూఢిల్లీకి వచ్చారు. భారత్ వారందరూ ఫిదా అయ్యేలా ఆతిథ్యం ఇచ్చింది.
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా పలు హిందూ సంఘాలు కలబురిగిలో ఆదివారం నిరసన చేపట్టాయి.
Israel: చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC)’పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో శనివారం అమెరికా, భారతదేశం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.
China: చైనాకు వరసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చైనా తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అత్యంత సులభంగా అమ్ముకునేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును తీసుకువచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టాలే ఉన్నట్లు ప్రపంచదేశాలు గమనించాయి. ఇదే కాకుండా భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్‌కి భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్ దేశాలు సమ్మతించడం చైనాకు పెద్ద దెబ్బగా
Russia: న్యూఢిల్లీ నిర్వహించిన జీ20 సమావేశం ‘మైలురాయి’గా మిగిలిపోతుందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. G20 అధ్యక్షుడిగా భారతదేశం తొలిసారిగా గ్లోబల్ సౌత్ స్థానాన్ని ఏకీకృతం చేసిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎజెండా కాకుండా భారత్ వ్యవహరించిందని చెప్పారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణపై ఆయన స్పందించారు.
Rahul Gandhi: భారత వర్సెస్ ఇండియా వివాదం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశం అయింది. అయితే ఈ వ్యవహారంపై మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోని సైన్సెస్ పిఓ యూనివర్సిటీలో మాట్లాడారు.
BJP-JDS Alliance: కర్ణాటకలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య చర్చలు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.
Pakistan: పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ ఎదుగుదలను చూసి అక్కడి ప్రజలు అసూయ వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఒకేసారి స్వాతంత్య్రం పొందినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం ప్రజాస్వామ్యం మాటున సైన్యం రాజ్యమేలుతోంది. చివరకు 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో ఎదిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత ఉంది. చివరకు ప్రజలకు నిత్యావసరాలు, కరెంట్, గ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. ఒక వేళ ఉన్నా కూడా ధరలు చుక్కలను…
Pakistan: పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రవాదుల హత్యల్లో ఇది నాల్గొవది.
Rajasthan: రాజస్థాన్‌కి చెందిన ఓ మహిళ అసలు విషయం తెలిస్తే తన భర్త ఎక్కడ వదిలేస్తాడో అని ఏకంగా సామూహికి అత్యాచారానికి గురైనట్లు నాటకం ఆడింది. భిల్వారాలోని ఓ వివాహిత తానను అపహరించి, గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఇదంతా వట్టిదే అని మహిళ నకిలీ రేప్ స్టోరీని అల్లిందని తేల్చారు.