G20 Dinner: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి అందని ఆహ్వానం.. జీ20 విందుకు వచ్చేది వీళ్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Dinner: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 దేశాధినేతలకు శనివారం విందు ఇవ్వనున్నారు. అయితే ఈ విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా కలిగిని ఖర్గేకు ఆహ్వానించలేదు. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అతిథులు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులైన డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ కూడా అతిథుల లిస్టులో ఉన్నారు.
Read Also: Uttar Pradesh: దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. బీఫ్ తినాలంటూ బలవంతం..
Also Read
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
బీహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ విందుకు హాజరవుతామని ప్రకటించిన ముఖ్యమంత్రుల్లో ఉన్నారు. ఆహ్వానించబడిన అతిథులంతా రేపు సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంట్ హౌస్ కి చేరాలని కోరారు. అక్కడ నుంచి ప్రగతి మైదాన్ లోని భారత మండపానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కేంద్రం.
కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కార్యదర్శులు మరియు ఇతర ప్రత్యేక అతిథులందరినీ వారి నివాసం నుండి పార్లమెంట్ హౌస్‌కు తీసుకురావడానికి ఢిల్లీ పోలీసులు ప్రయాణ ప్రణాళికను రూపొందించారు. విందుతో పాటు సాంస్కృతిక సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ వివిధ దేశాధినేతలను వ్యక్తిగతంగా వేదిక వద్దకు స్వాగతిస్తారని అధికారులు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, విదేశాంగ మంత్రులు, వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన డెలిగేట్స్ మొత్తం 40 మందికి పైగా విదేశీ అతిథులు ఈ విందుకు హాజరవనున్నారు.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!