Special Parliament session: కేంద్రం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లోనే కొత్త పార్లమెంట్ కు సభ తరలివెళ్లనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేక యూనిఫాం ధరించనున్నారు. పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఈ డ్రెస్ కోడ్ ఉండనుంది. నెహ్రూ జాకెట్స్, ఖకీ ప్యాంట్స్ ఇలా యూనిఫాంలో పలు మార్పులు రానున్నాయి. సెప్టెంబర్ 18న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుండగా.. 19న వినాయక చతుర్థి రోజున కొత్త పార్లమెంొట్ భవనంలోకి లాంఛనంగా సభ ప్రవేశించననుంది.
Nitin Gadkari: కేంద్రం డీజిల్ వాహనాలు కొనుగోలు చేసుందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్క క్షణం ఆగాల్సింది. రానున్న రోజుల్లో డిజిల్ వాహనాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. డీజిల్ కార్లకు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. దాదాపుగా 10 శాతం జీఎస్టీ పెంపును ప్రతిపాదించే అవకాశం ఉందన్నారు.
Congress: మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘కేంద్రపాలిత ప్రాంతం’ చేయాలనుకుంటోందని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎజెండా ఇదేనని మహరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సోమవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ మహమ్మారి,
Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డి.సుధాకర్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఆస్తి వివాదం కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Cancer: శాస్త్రసాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు. ముందు దశల్లో గుర్తిస్తే కీమో థెరపీ, ఇతర విధానాలతో వ్యాధిని నయం చేస్తున్నారు వైద్యులు. అయితే క్యాన్సర్ చివరి దశల్లో మాత్రం రోగి ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణకు దొరకడం లేదు. ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధి పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందు అడుగు వేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూర్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలను గుర్తించి, చంపే…
Uttarakhand: యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న రామెందు ఉపాధ్యాయ్ అనే వ్యక్తి నేపాల్‌కి చెందిన 30 ఏళ్ల యువతి శ్రేయ శర్మతో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కూడా కలిసే ఉంటున్నారు. అప్పటికే పెళ్లైన రామెంద్ ఉపాధ్యాయ్, శ్రేయతో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని శ్రేయ ఒత్తిడి చేయడంతో దారుణంగా చంపేశాడు.
Kim Jong Un: అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు ఒత్తిడిని లెక్క చేయకుండా ఉత్తకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్నారు. కిమ్ తన ప్రత్యేక రైలులో ఉత్తర కొరియా నుంచి రష్యాలో వ్లాదివోస్టోక్కి ఆదివారం వెళ్లారు.
RSS: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ార్ఎస్ఎస్)కి కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరువనంతపురం జిల్లాలోని శర్కరా దేవీ ఆలయ ప్రాగణంలో ఎలాంటి సామూహిక ఆయుధ శిక్షణకు అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ ఆక్రమం ఆయుధ వినియోగాన్ని నిరోధించేలా ఆదేశించాలని కోరుతూ ఇద్దరు భక్తులు దాఖలు చేసిన పిటిషన్ ని విచారిస్తూ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
Nipah virus: ప్రాణాంతక వైరస్ ‘నిపా’ మరోసారి కలవరపెడుతోంది. గతంలో కేరళలో ఈ వైరస్ వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలుపోయాయి. తాజాగా మరోసారి కేరళలో ఈ వైరస్ వణుకుపుట్టిస్తోంది. తాజా ఇన్ఫెక్షన్ల వల్ల ఆ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలటో ఇద్దరు మరణించారు.
POK: గత కొంతకాలంగా పాకిస్తాన్ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్పాటు ఉద్యమాలు నడుస్తున్నాయి. సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిల్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు.