Kerala High Court: స్విగ్గీ, జొమాటోలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు పక్కన పోర్న్ చూస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. స్విగ్గీ, జొమాటోలు వద్దని పిల్లలకు వారి తల్లి వండి ఆహారాన్ని రుచి చూడనివ్వండి కామెంట్స్ చేసింది. ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఆర్డర్ చేసే ఆహారానికి బదులుగా పిల్లలు ఆరుబయట ఆడుకునేలా, వారి తల్లులు వండిపెట్టే ఆహారాన్ని అందచేసేలా తల్లిదండ్రులను ఒప్పించాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ సూచించారు.
Putin: భారత మిత్రదేశం రస్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ‘‘పీఎం మోడీ ఈస్ రైట్’’ అంటూ ఓ సదస్సులో ప్రశంసించారు. రష్యా వ్లాడివోస్టాక్ నగరంలో 8వ ‘ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాను ప్రధాని
NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువుల వల్ల ఒత్తిడి, తల్లిదండ్రుల కలలను నేరవేర్చలేమో అనే దిగులుతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. రాజస్థాన్ కోటాలో ఇప్పటికే చాలా మంది పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా 16 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కోటా నగరంలో ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం విచారం కలిగిస్తోంది.
Black hole: బ్లాక్ హోల్స్.. విశ్వంలో ఎంతటి వస్తువైనా దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సెకన్‌కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్లే కాంతి కూడా ఈ దట్టమైన బ్లాక్ హోల్స్ నుంచి తప్పించుకోలేదు.
Smoking: స్మోకింగ్.. సిగరేట్లను పీల్చుతూ సరదాగా రింగురింగులుగా వదులుతుంటారు. ఈ సరదానే తరువాత అలవాటుగా మారుతుంది. స్మోకింగ్ వల్ల దీర్ఘకాలంగా పలు వ్యాధులకు కారణమౌతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. క్యాన్సర్లకు కారణమవుతుంది. ఇదిలా ఉంటే ఇది మీ యవ్వనాన్ని కూడా ఖర్చు చేస్తుంది. త్వరగా వృద్ధాప్యానికి కూడా కారణమవుతుందని తాజా స్టడీలో తేలింది. పొగతాగడం వల్ల త్వరగా ముసలివాళ్లు అవుతారని చెబుతోంది.
Earth Like Planet: విశ్వం అంతా మహాసముద్రం అనుకుంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం ఒక నీటి చుక్క మాత్రమే. ఇంత పెద్దదైన బ్రహ్మాండంలో భూమిలాంటి గ్రహాలు లక్షల్లో ఉన్నా కూడా వాటిని మనం గుర్తించలేము. ఎందుకంటే మన సూర్యుడు ఉన్న మిల్కీవే గెలాక్సీలోనే కొన్ని మిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. మిల్కీవే గెలాక్సీని దాటాలంటేనే కొన్ని వేల ఏళ్ల కాంతి సంవత్సాల సమయం పడుతుంది. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి.
Uddhav Thackeray: రామమందిర ప్రారంభోత్సవ సమయంలో ‘గోద్రా’ తరహా కుట్ర జరుగుతుందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు నెల రోజుల ముందు అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా లక్షల్లో హిందువలు హాజరయ్యే అవకాశం ఉంది.
Sanatan Dharma: సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఆయన వ్యాఖ్యలపై ఫైర్ అవుతోంది. డీఎంకే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటంతో కాంగ్రెస్ కూడా విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందనేంటని..?
Khalistan: ఖలిస్తానీ వేర్పాటువాదులు పేట్రేగిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భారత రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడటంతో పాటు ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడికి పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ‘సిక్ ఫర్ జస్టిస్’ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారతీయ నాయకులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
Monu Manesar: వివాదాస్పద గోసంరక్షుడు మోనూ మనేసర్ ని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తలను హత్య చేశాడని, జూలై నెలలో హర్యానాలో నూహ్ ప్రాంతంలో మతకలహాలు పెరిగేందుకు కారకుడయ్యాడనే అభియోగాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో హర్యానాలో కారులో ఇద్దరు ముస్లింల శవాలు కాలిపోయన స్థితితో బయటపడ్డాయి. ఈ ఘటనలో మనేసర్ కీలక నిందితుడిగా ఉన్నాడు.