* నేడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. మధిరలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్న డిప్యూటీ సీఎం భట్టి..
* నేడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. గాంధీభవన్ లో జెండా ఆవిష్కరించనున్న మహేష్ గౌడ్..
* నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలు.. ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు వ్యతిరేకంగా ఆందోళనలు..
* నేడు అయోధ్యకు సీఎం చంద్రబాబు.. ఉదయం 11 గంటలకు అయోధ్య చేరుకోనున్న చంద్రబాబు.. అయోధ్య బాలరాముడిని దర్శించుకోనున్న ఏపీ సీఎం..
* నేడు గుంటూరులో రూ. 4.60 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వాటర్ స్కీంకు శంకుస్థాపన చేయనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
* నేడు నర్సాపురంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. సముద్ర తీరం దగ్గర గోడ నిర్మాణ పనుల పరిశీలన..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం..
* నేటి నుంచి తిరుమలలో SSD టోకెన్లు రద్దు.. జనవరి 7 వరకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన.. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు..
* నేడు కన్హా శాంతివనంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. సాయంత్రం 4: 30 గంటలకు కార్యక్రమం ప్రారంభం.. పాల్గొననున్న మోహన్ భగవత్, 79 దేశాల ప్రతినిధులు..
* నేడు కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. జలాంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం.. కార్వార్ హార్బర్ నుంచి జలాంతర్గామిలో ప్రయాణించనున్న ముర్ము.. జలాంతర్గామిలో ప్రయాణించనున్న రెండో రాష్ట్రపతిగా నిలవనున్న రాష్ట్రపతి.. 2006 ఫిబ్రవరి 13న విశాఖ నుంచి జలాంతర్గామిలో ప్రయాణించిన అబ్దుల్ కలాం..
* నేడు ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం.. ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ ప్రారంభం..
* నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు.. ఉదయం 8గంటల నుంచి మధ్యా్హ్నం ఒంటి గంట వరకు పోలింగ్.. సాయంత్రం 4గంటలకు కౌంటింగ్.. ప్రోగ్రెసివ్ ప్యానెల్ (పెద్ద నిర్మాతలు) వర్కసెస్ మన ప్యానెల్ ( చిన్న నిర్మాతలు).. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ను బలపరుస్తున్న అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు.. మన ప్యానెల్ ను సపోర్టు చేస్తున్న చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్..
* నేడు భారత్ వర్సెస్ శ్రీలంక మహిళల నాలుగో టీ20.. రాత్రి 7గంటలకు తిరువనంతపురంలో మ్యాచ్.. 5 మ్యాచుల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకున్న భారత్..