Pakistan: భారత్ జీ20 సదస్సును నిర్వహించిన తీరు పాకిస్తాన్‌కి ముఖ్యంగా అక్కడి రాజకీయ పార్టీలు, సైన్యానికి అసూయను కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రవాసంలో ఉన్న పాకిస్తాన్ పీఎంఎల్-ఎన్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జీ20 సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తానను పదవీ నుంచి దించేయకుంటే భారత్ జీ20కి ఆతిథ్యం ఇచ్చిన విధంగా పాకిస్తాన్ కూడా అలాంటి సమావేశాలను నిర్వహించేదని వ్యాఖ్యానించారు.
Dunith Wellalage: శ్రీలంక న్యూ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే, భారత్ తో మ్యాచు ఓడిపోయినా అందరి మనుసుల్ని మాత్రం గెలుచుకున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ ఇండియా టీంకు ముచ్చెమటలు పట్టించాడు.
సోమవారం ఆల్ పార్టీ మీటింగ్ లో సమావేశాల ఎజెండా తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19న వినాయక చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ లోకి సభ మారబోతోంది. మరోవైపు శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు వినాయక చవితి రోజున పార్లమెంట్ సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
Sugar prices: ఇండియాలో చక్కెర ధరలు పెరగనున్నాయా..? అయితే పరిణామాలు చూస్తే మాత్రం రానున్న రోజుల్లో చక్కెర ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. 2023-24 క్రాప్ ఇయర్ లో చక్కెర ఉత్పత్తి 14 శాతం తగ్గింది. చక్కెర ఉత్పత్తితో తగ్గింపు ఆహార ద్రవ్యోల్భణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉంది.
Asia cup 2023: ఇండియా క్రికెట్ టీం ఆసియా కప్ లో తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో కూడా మ్యాజిక్ చేసింది. పాకిస్తాన్ మ్యాచ్‌తో ఎంత మజా వచ్చిందో.. శ్రీలంకతో లోస్కోరింగ్ మ్యాచులో అంతకన్నా ఎక్కువ మజా వచ్చిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
Jammu Kahmir Encounter: జమ్మూ కాశ్మీర్లో రాజౌరీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మంగళవారం సాయంత్రం జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆర్మీ డాగ్ యూనిట్ కి చెందిన కెంట్ అనే ఆరేళ్ల ఆడ లాబ్రడార్ కాల్పుల్లో మరణించింది.
iPhone 15: ఆపిల్ ఐఫోన్ల లవర్స్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. మంగళవారం రోజున ఆపిల్ తన ప్రతిష్టాత్మక ఐఫోన్ 15ని 'వండర్లస్ట్' ఈవెంట్లో ఆవిష్కరించింది. ఐఫోన్ లవర్స్ దీన్ని కొనేందుకు సిద్ధమవుతున్నారు.
Nipah Virus: నిపా వైరస్ మరోసారి కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మరణించారు. వీరితో సంబంధం ఉన్న వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా వచ్చిన నిపా వైరస్ వేరియంట్ తక్కువ వ్యాప్తి ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ప్రకటించారు.
G20 Summit: ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారతదేశం జీ20 సదస్పును నిర్వహించింది. బైడెన్, రిషి సునాక్, మక్రాన్ వంటి దేశాధినేతలు న్యూఢిల్లీకి వచ్చారు. ఈ సమావేశాల్లో భారత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రపంచ దేశాధినేతలకు మరిచిపోలేని విధంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇదిలా ఉంటే చైనా అధికారులు మాత్రం ఓవర్ యాక్షన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా డేలిగేట్స్ బ్యాగులను చెక్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
Live-In Relation: సహజీవనం చేస్తూ సర్వస్వం అర్పిస్తున్న యువతులు హత్యకు గురవుతున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య దేశంలో లివ్-ఇన్ రిలేషన్లో పరిణామాలను హెచ్చరించింది. ఏళ్లుగా సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చే సరికి మహిళల్ని కడతేరుస్తున్నారు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ సంస్కృతికి ఈ విధానం నష్టం చేకూరుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.