Dunith Wellalage: వాళ్లిద్దరి వికెట్లు ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. శ్రీలంక సెన్సేషన్ వెల్లలాగే ఫుల్ ఖుషీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dunith Wellalage: శ్రీలంక న్యూ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే, భారత్ తో మ్యాచు ఓడిపోయినా అందరి మనుసుల్ని మాత్రం గెలుచుకున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ ఇండియా టీంకు ముచ్చెమటలు పట్టించాడు. సూపర్ 4లో నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో తన స్పిన్ తో భారత స్టార్ బ్యాటర్లను కట్టిపడేశాడు. కేవలం 213 పరుగులకే ఇండియా ఆలౌట్ కావడానికి కారకుడయ్యాడు. భారత టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు. మరోవైపు బ్యాటింగ్ లో కూడా చివరిదాకి నిలబడి శ్రీలంకను గెలిపించే ప్రయత్నం చేశాడు.
Read Also: Chandrababu Arrest: సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్.. ‘కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’
Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
శ్రీలంక ఓడిపోయిన ఈ కుర్రాడు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ప్రపంచ స్థాయి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వీరిద్దరి వికెట్లను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చెబుతున్నాడు. 40 పరుగులకే 5 వికెట్లు తీసిన వెల్లలాగే వీరిద్దరితో పాటూ హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వికెట్లు తీశారు. టీంలో ఉన్న స్టార్ బ్యాటర్లందరిని ఫెవిలియన్ కు పంపాడు. తన బేసిక్స్ కి అనుగుణంగా, లైన్ మిస్సవ్వకుండా బౌలింగ్ చేశానని, దీంతోనే భారత్ ని ఒత్తడికి నెట్టేశానని అన్నారు.
ఇటు బౌలింగ్ లో సత్తా చాటిన వెల్లలాగే, బ్యాటింగ్ లో భారత్ ని కలవరపెట్టాడు. సీనియర్ ప్లేయర్లు ఒక్కక్కరుగా ఔట్ అవుతున్నా.. చివరదాకా క్రీజులో నాటౌట్ గా నిలిచాడు. వెల్లలాగే 46 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ధనంజయ డిసిల్వాతో కలిసి ఏడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక విజయవకాశాలు మెరుగయ్యాయి. ఒకానొక సమయంలో ఈ జోడి శ్రీలంకను గెలిపించే ప్రయత్నం చేసింది. జడేజా, కుల్దీప్ విజయానికి కళ్లేం వెశారు. శ్రీలంక 172 పరుగులకే ఆలౌటై 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. శ్రీలంక తర్వాతి మ్యాచులో పాకిస్తాన్ తో తలపడనుంది. ఒక వేళ మ్యాచులో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడుతుంది.
తాజావార్తలు
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?