Venu Goapl Reddy
Author- NTV Telugu-
Paul Alexander: “ఇనుప ఊపిరితిత్తుల”తో 70 ఏళ్లు గడిపిన ‘పోలియో పాల్’ మృతి..
Paul Alexander: పాల్ అలెగ్జాండర్(78) గత 70 ఏళ్లుగా ఇనుప ఊపితిత్తులతో జీవనం సాగిస్తున్నాడు. పూర్తిగా ఐరన్ లంగ్స్ మిషన్ ద్వారా ఇన్నేళ్లు జీవించిన అతను మరణించాడు. ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడిన పాల్ నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. చివరకు శ్వాస కూడా స్వయంగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని 600 మిలియన్ పౌండ్ల విలువైన యంత్రం సాయంతో శ్వాస తీసుకుంటూ జీవిస్తున్నాడు. -
MK Stalin: బీజేపీ, ఏఐడీఎంకే మధ్య రహస్య సంబంధం..సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణలు..
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు విడిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నాయని, అయితే రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బుధవారం పొల్లాచ్చిలో జరిగిన డీఎంకే సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏఐడీఎంకే తమ పొత్తు చెడిపోయిందని చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, వారి మధ్య రహస్య సంబంధం ఉందని ఆరోపించారు. -
BJP 2nd List: నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఖట్టర్.. బీజేపీ రెండో లిస్టులో ఉన్న కీలక నేతలు వీరే..
BJP 2nd List: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో బీజేపీ తన రెండో జాబితాను ప్రకటించింది. గతవారం 195 మందితో తొలిజాబితా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, బుధవారం 72 మందితో రెండో జాబితాను ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోని పలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. Read Also: Aamir Khan: ఆమెతో శృంగారం.. అందుకే విడాకులు.. మాజీ భార్య […] -
Tamil Nadu: “నేను మంత్రిని కాకుంటే అతడిని ముక్కలు చేసేవాడిని”.. ప్రధాని మోడీకి డీఎంకే మంత్రి బెదిరింపులు..
Tamil Nadu: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన తమిళనాడు మంత్రిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వివాదాస్పదం అయ్యాయి. మంత్రి అన్బరసన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అధికార డీఎంకేపై బీజేపీ విరుచుకుపడుతోంది. -
Rabies: కుక్కకాటు తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నా దక్కని ప్రాణం.. రేబిస్‌తో మహిళ మృతి..
Rabies: కుక్కకాటు తర్వాత రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ యువతి కుక్క కరిచిన తర్వాత రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మూడు రోజుల తర్వాత రేబిస్‌తో మరణించింది. అత్యంత అరుదుగా జరిగిన ఈ ఘటన కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. మొత్తం 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు. -
FASTag: మార్చి15 లోగా ఇతర బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్‌కి మారాలి.. పేటీఎం యూజర్లకి హైవే అథారిటీ సూచన
FASTag: సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎంకి మరో షాక్ తగలింది. మార్చి 15 లోగా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు ఇతర బ్యాంకులకు మారాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సూచించింది. మార్చి 15, 2024లోపు వేరే బ్యాంకులు జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పెనాల్టీలు, రెట్టింపు రుసుము చెల్లించకుండా ఈ సూచనను పాటించాలని మార్చి 13న రోడ్డు & రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. -
Khalistani Terrorist: భారత్‌కి మద్దతు ఇచ్చాడని.. న్యూజిలాండ్ ఉప ప్రధానికి ఖలిస్తాన్ టెర్రరిస్టు పన్నూ బెదిరింపులు..
Khalistani Terrorist: ఖలిస్తాన్ టెర్రిరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. భారత్‌కి మద్దతుగా మాట్లాడినందుకు న్యూజిలాండ్ ఉప ప్రధాని విన్స్టన్ పీటర్స్‌ని బెదిరించాడు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందనే దానికి సరైన ఆధారాలు లేవని విన్స్టన్ పీటర్స్ అన్నారు. నిజ్జర్ హత్యలో కెనడా భారత ప్రమేయం ఉన్నట్లు సరైన ఆధారాలు ఇవ్వలేదని పీటర్స్ పేర్కొన్నారు. -
Bombay High Court: అర్ధరాత్రి నిమ్మకాయ కోసం మహిళ ఇంటి తలుపు తట్టడం అధికారికి తగునా..?
Bombay High Court: అర్ధరాత్రి ఒంటిగా ఉన్న మహిళ ఇంటి తలుపు తట్టిని అధికారి కేసును బాంబే హైకోర్టు విచారించింది. తప్పుడు ప్రవర్తన కారణంగా అతనిపై విధించిన జరిమానాను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ నితిన్ జామ్దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మార్చి 11న ఈ కేసును విచారించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, అంతకుముందు మద్యం సేవించి ఉన్నాడని, తన సహోద్యోగి అయిన మహిళ భర్త పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో… -
IBM layoffs: కేవలం 7 నిమిషాల మీటింగ్‌లోనే ఉద్యోగుల లేఆఫ్.. ఐబీఎం షాకింగ్ నిర్ణయం..
IBM layoffs: ఆర్థిక మాంద్యం భయాలు, పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఇలా పలు అంశాలు టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్‌కి కారణమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఎక్స్ ఇలా పలు కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ప్రస్తుతం మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
Hyderabad Liberation Day: సెప్టెంబర్ 17న ‘‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’.. అమిత్ షా ప్రకటన..
Hyderabad Liberation Day: ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’గా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదారాబాద్ సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగి ఇండియన్ యూనియన్‌లో చేరిందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 17, 1948న 'ఆపరేషన్ పోలో' అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది.
తాజావార్తలు
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!