Sugar prices: ఇండియాలో చక్కెర ధరలు పెరగనున్నాయా..? అయితే పరిణామాలు చూస్తే మాత్రం రానున్న రోజుల్లో చక్కెర ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. 2023-24 క్రాప్ ఇయర్ లో చక్కెర ఉత్పత్తి 14 శాతం తగ్గింది. చక్కెర ఉత్పత్తితో తగ్గింపు ఆహార ద్రవ్యోల్భణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉంది. మహారాష్ట్రలో కరువు పరిస్థితులు చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తుందని, ధరలు పెరిగే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. భారతదేశంలో మూడొంతుల చక్కెర మహారాష్ట్రలోనే ఉత్పత్తి అవుతుంది.
ఈ ఏడాది 14 శాతం చక్కెర ఉత్పత్తిలో తగ్గుదల కనిపించవచ్చని, ఇది గడిచిన నాలుగేళ్లలో కనిష్ట ఉత్పత్తిని సూచిస్తోంది. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఆగస్టులో వర్షాలు తగ్గి, పొడి వాతావరణం ఏర్పడింది. ఇది చెరుకు పంటపై ప్రభావం చూపించనుంది. దీంతో చెరుకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దేశీయం చక్కెర ఉత్పత్తి తగ్గితే భారత్ విదేశాలకు చక్కెర ఎగుమతులపై బ్యాన్ విధించే అవకాశం ఉంది. ఇది ప్రపంచస్థాయిలో చక్కెర ధరలపై ప్రభావం చూపిస్తుంది. దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పటికే చక్కెర ధరలు అత్యధిక స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.
Read Also: Asia cup 2023: “ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసింది”.. షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై
దేశీయంగా ధరలు పెరిగడం సంభవిస్తే, బలరాంపూర్ చిని, ద్వారికేష్ షుగర్, శ్రీ రేణుకా షుగర్స్ మరియు దాల్మియా భారత్ షుగర్ వంటి ప్రముఖ ఉత్పత్తిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కంపెనీలు మెరుగైన లాభాలను చూడొచ్చు. తద్వారా రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలవు.
వెస్ట్ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీబీ థొంబారే మాట్లాడుతూ.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2023-24 సీజన్ లో మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి గతేడాది 10.5 మిలియన్ టన్నుల నుండి 9 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేశారు. చెరుకు ఉత్పత్తికి కీలకమైన నెలలో సరైన వర్షాలు కురవలేదని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ఆగస్టు నెలలో 59 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 20214-22 సీజన్ లో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో 13.7 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తిని సాధించింది. ఈ సీజన్ లో 11.2 మిలియన్ టన్నుల చక్కెరను భారత్ ఎగుమతి చేసిది. 2022-23లో 10.5 మిలియన్ టన్నులకు తగ్గింది. భారత ఎగుమతులు 6.1 మిలియన్ టన్నులకు తగ్గింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. కేంద్రం చక్కెర మిల్లులు ఎగుమతి చేయకుండా నిషేధం విధించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.