Venu Goapl Reddy
Author- NTV Telugu-
Mukhtar Ansari: ఆయుధ లైసెన్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవితఖైదు..
Mukhtar Ansari: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవతఖైదు విధించింది. 1990లో నకిలీ పత్రాలను ఉపయోగించి అక్రమంగా ఆయుధ లైసెన్స్ పొందిన కేసులో బుధవారం అన్సారీకి జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 428 (అపరాధం), 467 (విలువైన భద్రతను ఫోర్జరీ చేయడం), 468 (మోసం కోసం ఫోర్జరీ), 120బి (నేరపూరిత కుట్ర) మరియు ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30 కింద జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా… -
Manohar Lal Khattar: సీఎం పదవికి రాజీనామా తర్వాత, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఖట్టర్..
Manohar Lal Khattar: హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తన ఎమ్మెల్యే పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేయడం గమనార్హం ఖట్టర్ 2014 నుంచి కర్నాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. కర్నాల్ లోక్‌సభ అభ్యర్థిగా ఖట్టర్‌ని బీజేపీ బరిలోకి దింపొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
Hardeep Nijjar Killing: “నిజ్జర్ హత్యపై ఆధారాలు ఏవి..?” కెనడాను ప్రశ్నించిన న్యూజిలాండ్..
Hardeep Nijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదానికి కారమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం మరింత ఎక్కువైంది. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలు చేసిన కెనడాకు మిత్ర పక్షం న్యూజిలాండ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. -
Uddhav Thackeray: “బీజేపీ అవమానిస్తే మాతో చేరండి, మంత్రిని చేస్తాం”.. నితిన్ గడ్కరీకి ఠాక్రే పిలుపు..
Uddhav Thackeray: మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధింస్తుందని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని పుసాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అవమానిస్తోందని, బీజేపీ అవమానిస్తే తమతో చేరాలని ఠాక్రే కోరారు. ఒకప్పుడు అవినీతి ఆరోపణలతో కృపాశంకర్(మాజీ కాంగ్రెస్ నేత)ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఇప్పుడు ఆయనకు బీజేపీ తన మొదటి జాబితాలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని ఠాక్రే అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తొలిజాబితాలో ఉన్నారని, కానీ నితిన్… -
China: భారత దళాల ఉపసంహరణపై మాల్దీవులకు మద్దతు ఇస్తున్నట్లు చైనా ప్రకటన..
China: మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తాము మద్దతు ఇస్తున్నామని చైనా మంగళవారం ప్రకటించింది. ఫస్ట్ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది మాల్దీవులను విడిచిపెట్టింది. వారి స్థానంలో పౌరసిబ్బందిని నియమించింది. హెలికాప్టర్ సేవల్ని నిర్వహిస్తున్న భారత సైన్యం దేశాన్ని విడిచిపెట్టినట్లు మాల్దీవుల మీడియా సోమవారం తెలిపింది. -
India-China Border: సరిహద్దుల్లో పుట్టుకొస్తున్న చైనా గ్రామాలు.. భారత్-చైనా మధ్య ఘర్షణ తప్పదన్న యూఎస్ ఇంటెలిజెన్స్..
India-China Border: 2024 ఆనువల్ థ్రెట్ అస్సెస్మెంట్ నివేదికలో భారత్, చైనాల మధ్య సాయుధ పోరాటం తప్పకపోవచ్చని యూఎస్ ఇంటెలిజెన్స్ అభిప్రాయపడింది. భారత సరిహద్దుల వెంబడి చైనా తన పుట్టగొడుగుల్లా గ్రామాలను విస్తరిస్తోందని చెప్పింది. భారత్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దళాల మోహరింపుకు చైనా ప్లాన్ చేస్తుందని, ఇది భారత్‌తో సాయుధ పోరాటానికి దారి తీసే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. వ్యూహాత్మక విస్తరణలో వాస్తవ నియంత్రణ రేఖకు ఎదురుగా తూర్పు, మధ్య ప్రాంతాల్లో చైనా ‘జియోకాంగ్’ గ్రామాల నెట్వర్క్ని విస్తరిస్తోంది. -
Shivaraj kumar: భార్యకు మద్దతుగా ప్రచారబరిలో శివన్న..
Shivaraj kumar: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 9న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ భార్య గీత పేరు ఉంది. ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అవసరమైనప్పుడు తాను ప్రచారంలో పాల్గొంటా అని ఆయన… -
Tamil Nadu: బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం.. అన్నామలై సమక్షంలో చేరిక
Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో కీలక పరిణామం జరిగింది. ప్రముఖ తమిళనటుడు శరత్ కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసింది. అఖిల ఇండియా సమతువ మక్కల్ కట్చీ(AISMK)ని బిజెపిలో విలీనం చేశారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై సమక్షంలో శరత్ కుమార్, ఆయన పార్టీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశఐక్యతను పెంపొందించంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు మోడీకి సహకరిస్తానని శరత్ కుమార్ అన్నారు. -
CAA: భారతీయ ముస్లింలు సీఏఏని స్వాగతించాలి: ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్..
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ)ని భారతదేశ ముస్లింలతా స్వాగతించాలని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్వేలీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏని నోటిఫై చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని స్వాగతించారు. ముస్లిం సమాజంలో భయాలను తొలగించడానికి ప్రయత్నించాలని, సీఏఏ ప్రభావం భారతీయ ముస్లింపై, వారి పౌరసత్వంపై ఉండదని అన్నారు. -
Bihar: పెళ్లి వీడియో తీసేందుకు వచ్చి.. పెళ్లికొడుకు చెల్లిని లేపుకుపోయిన వీడియోగ్రాఫర్..
Bihar: బీహార్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లిని వీడియో తీసేందుకు వచ్చిన వ్యక్తి ఏకంగా పెళ్లి కొడుకు చెల్లిని లేపుకుపోయాడు. ప్రస్తుతం ఈ వార్త ఆ రాష్ట్రంలో తెగవైరల్ అవుతోంది. ముజఫర్ నగర్లో ఓ పెళ్లి వేడుకను చిత్రీకరించేందుకు వచ్చిన యువకుడు వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఈ ఘటన అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు అన్నీ పూర్తయిన తర్వాత బాలిక పారిపోయింది.
తాజావార్తలు
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!