World Cup 2023: ప్రపంచ కప్ 2023లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 345 భారీ టార్గెట్‌ని సునాయసంగా ఛేదించింది. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ తో పాటు అబ్దుల్లా షఫీక్ సెంచరీలతో చెలరేగి పాక్ విజయంలో కీలకంగా మారారు. రిజ్వాన్ 121 బంతుల్లో 131 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే తాను సాధించిన సెంచరీని ‘‘గాజాలోని బ్రదర్స్, సిస్టర్స్’’కోసం అంకితమిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీంతో పాటు తన జట్టు గెలిచినందుకు సంతోషంగా ఉందని, హైదరాబాద్ ప్రజలు అద్భుతమై ఆతిథ్యం, సపోర్టు అందించిందుకు థాంక్స్ చెప్పాడు. అయితే రిజ్వాన్ ఇజ్రాయిల్- హమాస్ యుద్ధంలో గాజాలోని ప్రజలకు సపోర్ట్ చేయడం వివాదాస్పదం అయింది. నెటిజెన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు.
Read Also: S JaiShankar: చైనా రుణ ఉచ్చుతో జాగ్రత్త.. జైశంకర్ హెచ్చరిక
ఒక నెటిజన్ రిజ్వాన్ ట్వీట్‌కి బదులిస్తూ.. ‘‘ఒక సెంచరీ గాజాకు ఎలా హెల్ప్ చేస్తుంది. దీనికి బదులుగా మీరు, పాక్ జట్టు మొత్తం వరల్డ్ కప్ నుంచి వచ్చే డబ్బుని, అవార్డులను, ఎండార్స్మెంట్లను, అన్ని రకాల ఆదాయాలను వారికి ఇస్తే నిజమైనన సాయం అవుతుంది’’ అంటూ పోస్ట్ చేశాడు.
మరొకరు ‘‘అంటే ఒక క్రికెట్ మ్యాచులో పాకిస్తాన్ గెలిస్తే గాజా యుద్ధంలో ఇజ్రాయిల్ ఓడిస్తుందా..?’’ అంటూ సెటైర్లు వేశారు. మరొకరు ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేసినప్పుడు, చాలా మంది మరణించినప్పుడు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు..? సిగ్గుపడాలి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారంతో ఇజ్రాయిల్ – హమాస్ మధ్య యుద్దం 5వ రోజుకు చేరుకుకంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఇరువైపుల కలిపి 3000 పైగా మంది చనిపోయారు. హమాస్ జరిపిన దాడిలో 1200 మందికిపైగా ఇజ్రాయిలీ పౌరులు చనిపోయారు. హమాస్ తీవ్రవాదులు పైశాచికంగా వ్యవహరిస్తూ, చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. వారి తలలను తెగనరికారు.