Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగతనాన్ని అడ్డుకోబోయిన క్యాబ్ డ్రైవర్ని అత్యంత ఘోరంగా కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో మహిపాల్‌పూర్ ప్రాంతంలో జరిగింది. 43 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ బిజేంద్ర ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై మరణించారు.
Read Also: Vidya Balan: డర్టీ పిక్చర్ హీరోయిన్ కు ఇంత పెద్ద కూతురు.. క్లారిటీ దొరికేసింది
వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్‌కి చెందిన బిజేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ప్రాంతంలో క్యాబ్ నడుపుతున్న సమయంలో దొంగలు కారును దొంగిలించడానికి చూశారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బిజేంద్రను 200 మీటర్ల వరకు కారుతోనే ఈడ్చుకెళ్లారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో డ్రైవర్ తలకు బలమైన గాయమై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన బిజేంద్ర మరణించాడు. హత్య, సాక్ష్యాలు ధ్వంసం చేయడం వంటి అభియోగాల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఆరు టీములతో పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి1న ఇలాగే ఓ యువతి తన స్కూటీపై స్నేహితురాలితో వెళ్తుంటే కారుతో ఢీకొట్టి అంజలి సింగ్ అనే యువతిని దాదాపుగా 12 కిలోమీటర్లు కారుతో ఈడ్చుకెళ్లారు. కారు కింద చిక్కుకుపోయిన అంజలి సింగ్ తీవ్రగాయాలతో మరణించింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
हैवानियत: लूटपाट के बाद कार से 200 मीटर तक घसीटा, रोंगटे खड़े कर देने वाला वीडियो वायरल#DelhiCrime #Kanjhawala #Mahipalpur @DelhiPolice pic.twitter.com/9YySYnoqQq
— Aakash Bhardwaj (@AakashB2021) October 11, 2023