Rajasthan: పెళ్లిళ్ల కారణంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని నవంబర్ 30తో ముగించి, డిసెంబర్ 3న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి చూపు ఈ ఎన్నికలపై ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని సవరించినట్లు ప్రకటించింది. నవంబర్ 23న ఓటింగ్ జరగాల్సి ఉంటే దీన్ని నవంబర్ 25కి మార్పింది. జోధ్‌పూర్ ఎంపీ పీపీ చౌదరితో పాటు పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఆ రోజు దేవ్ ఉతాని ఏకాదశి ఉండటంతో పోలింగ్ తేదీని మార్చాలని కోరారు. పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు ఆ రోజున ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పోలింగ్ తగ్గే అవకాశం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. కారుతో క్యాబ్ డ్రైవర్నిని ఈడ్చుకెళ్లారు..
వివాహ రద్దీ, ఎన్నికలు ఒకేసారి జరిగితే రవాణా సౌకర్యాలకు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని, పోలింగ్ లో ఓటర్ల భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉందని ఈసీ వెల్లడించింది. దీంతో పోలింగ్ తేదీని నవంబర్ 23 నుంచి 25కి మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. బీజేపీ ఈ సారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?