Israel-Hamas War: అంధకారంలో గాజా.. ఉన్న ఒక్క విద్యుత్ కేంద్రం ఖతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి మిడిల్ ఈస్ట్ లో మరోసారి టెన్షన్ వాతావరణం తీసుకువచ్చింది. హమాస్ దాడుల వల్ల ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరులు మరణించగా.. పలువురు బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లింది హమాస్. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. హమాస్‌ని పూర్తిగా నాశనం చేసేదాకా విశ్రమించేది లేదని తేల్చి చెప్పింది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానికి దాడులను చేస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో గాజాలో కూడా 1500కి పైగా మంది మరణించారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3000 వేలకు చేరింది.
Read Also: Bhupesh Baghel: సమావేశంలో క్యాండీక్రష్ ఆడిన కాంగ్రెస్ సీఎం.. బీజేపీ తీవ్ర విమర్శలు..
Also Read
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజాలో ఉన్న ఏకైక విద్యుత్ కేంద్ర కూడా పనిచేయడం లేదని నివేదికలు తెలిపాయి. దీంతో గాజాలో అంధకారం అలుముకుంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనం ఇలా ప్రతీ అవసరాన్ని ఇజ్రాయిల్ సైన్యం కట్ చేసింది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాట్లాడుతూ, “విద్యుత్ ఉండదు, ఆహారం లేదు, ఇంధనం ఉండదు, ప్రతిదీ కట్ చేస్తామని” హెచ్చరించారు. అక్టోబర్ 7 హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయిల్ గాజాలోని పలు ప్రాంతాలకు పూర్తిగా విద్యుత్‌ని నిలిపేసింది. తాజాగా పాలస్తీనా ఎన్‌క్లేవ్ లోని ఏకైక పవర్ స్టేషన్ పనిచేయడం ఆగిపోయింది.
ఇప్పటికే గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఇస్లామిక్ యూనివర్సిటీని ఇజ్రాయిల్ వైమానికదళం ధ్వంసం చేసింది. హమాస్ ఉగ్రవాదులు ఉంటున్న ప్రతీ ఇంటిని పేల్చేస్తోంది. హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డయిఫీ ఇంటిని కూడా టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో డయిఫే కుటుంబానికి చెందిన పలువురు మరణించినట్లు హమాస్ ధృవీకరించింది. మరోవైపు హమాస్ కి మద్దతుగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు, సిరియా నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇజ్రాయిల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!