Israel-Hamas War: హమాస్ వద్ద బందీలుగా 210 మంది.. ఇజ్రాయిల్ సైన్యం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి జరిపారు. ఈ దాడిలో ఇజ్రాయిల్ లోని 1400 మంది చనిపోయారు. మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా దారుణంగా ఊచకోతకు పాల్పడ్డారు. మరికొంత మందిని బందీలుగా గాజా ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం హమాస్ వద్ద 210 మంది ఇజ్రాయిల్ ప్రజలు బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. అయితే ఇది తుది సంఖ్య కాదని, తప్పిపోయిన వారి కోసం మిలిటరీ దర్యాప్తు జరుగుతోందని, బందీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి అన్నారు. నిన్న ఇద్దరు అమెరికన్ తల్లి కూతుళ్లను హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టారు. వీరు కాకుండా 210 మంది బందీలుగా ఉన్నారని తెలిపారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
గాజాలో మానవతా సంక్షోభం లేదు: ఐడీఎఫ్
గాజాలోని బందీలను విడిపించడంతో పాటు హమాస్ ఉగ్రవాదులను నేలమట్టం చేయడానికి ఇజ్రాయిల్ ప్రణాళిక రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఉత్తర భాగం నుంచి ప్రజలు సురక్షితం ప్రదేశమైన దక్షిణ ప్రాంతం వైపు వెళ్లాలని ఆదేశించింది. దీంతో లక్షలాది మంది పాలస్తీయన్లు దక్షిణ వైపు వెళ్లారు. అయితే గాజాలో ఎలాంటి మానవతా సంక్షోభం లేదని ఐడీఎఫ్ శనివారం తెలిపింది. 10 లక్షల మందిలో 7 లక్షల మంది ఉత్తర ప్రాంత నివాసితులు కొన్ని రోజుల క్రితం దక్షిణ ప్రాంతానికి వెళ్లారని తెలిపింది.
నీటి కొరత గాజాలో లేదని, వారాలకు సరిపడే ఫుడ్ ఉందని, మెడిసిన్ సప్లై కూడా ఉందని ఇజ్రాయిల్ రక్షణ అధికారి వెల్లడించారు. హమాస్ ప్రజలు దక్షిణ భాగం వైపు వెళ్లకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈజిప్టు నుంచి గాజా దక్షిణ ప్రాంతంలోని రఫా క్రాసింగ్ నుంచి ఫుడ్, వాటర్, మెడిసిన్ సాయం లభిస్తోందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియల్ హగారి అన్నారు.
గత రెండు వారాల నుంచి ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. ఈ యుద్ధంలో అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి అనంతరం నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానికి దళం నిప్పులు కురిపిస్తోంది. గాజాలో ఇప్పటి వరకు 4000 మంది మరణించారు. హమాస్ కీలక ఉగ్రవాదులను ఇజ్రాయిల్ మట్టుబెడుతోంది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..