Supreme Court: రాజ్యసభ ఛైర్మన్‌కి క్షమాపణలు చెప్పండి.. ఆప్ ఎంపీకి సుప్రీంకోర్టు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్‌ని క్షమాపణలు కోరాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రాఘవ్ చద్దా సస్పెన్షన్ కేసులో ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. ఎంపీ క్షమాపణలను సానుభూతితో పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ని సుప్రీం సూచించింది. విచారణ సమయంలో రెండు పక్షాలు ముందుకు వెళ్లే మార్గాన్ని కొనుగొనడానికి ప్రయత్నించాలని కోరింది.
Read Also: Iran: డ్రగ్ రిహాబ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 32 మంది దుర్మరణం..
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ఆప్ ఎంపీ తొలిసారి పార్లమెంటేరియన్ అని, అతి పిన్న వయస్కుడని సీజేఐ వైవీ చంద్రచూడ్ పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌కి క్షమాపణలు చెప్పడం వల్ల ఎలాంటి నష్టం లేదని చద్దా తరపు న్యాయవాది షాదన్ ఫరాసత్ అన్నారు. ఈ రోజు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సమావేశమవుతోందని, ఈ కేసులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును దీపావళి తర్వాత జాబితా చేసింది. తదుపరి పరిణామాలను తెలియజేయాలని అటార్నీ జనరల్‌ని కోరింది. కేంద్రం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా చద్దా క్షమాపణలు చెప్పడం మంచి ఎంపిక అని అంగీకరించారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లును పరిశీలించే సెలెక్ట్ కమిటీలో కొంతమంది ఎంపీల పేర్లను అనుమతి లేకుండా చేర్చారనే ఆరోపణలతో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై ఆగస్టు నెల నుంచి నిరవధిక సస్సెన్షన్ వేలు పడింది. రాఘవ్ చద్దా తమ అనుమతి లేకుండా హౌజ్ ప్యానెల్ లో పేర్లు ఇవ్వడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారని నలుగురు ఎంపీలు ఆరోపించారు. దీంతో ఆగస్టు 1 నుంచి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రివిలేజ్ కమిటీ తన వాదనల్ని సమర్పించే వరకు చద్దాను సస్పెండ్ చేయాలని సభా నాయకుడు పీయూష్ గోయల్ చేసిన తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!