Mahua Moitra: ‘‘ క్యాష్ ఫర్ క్వేరీ ’’ కేసులో మహువా మోయిత్రాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని విమర్శించేందుకు అదానీ వ్యవహారాన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారని, పార్లమెంట్లో అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఇప్పటికే హీరానందానీ అఫిడవిట్ సమర్పించారు. మహువా తన దగ్గర నుంచి గిఫ్టులు తీసుకున్నారని తెలిపారు.
Boat Capsizes: బీహార్ రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చప్రాలో సరయూ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలు వెలికితీశారు. మరో 15 మంది కోసం గాలిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు.
Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. వచ్చే నెలలో రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందుకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచే అరెస్టులు ప్రారంభించారని ఆమె ఆరోపించారు.
Mahua Moitra: క్యాష్ ఫర్ క్వేరీ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా రేపు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నారు. వీటిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభ స్పీకర్ కి లేఖ రాశారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి ఆమె పార్లమెంట్ ఐడీ లాగిన్ అయిందని ఆరోపిస్తూ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి…
Same-Sex Marriage Case: స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం చట్టబద్ధమైన గుర్తింపుకు నిరాకరించింది. దీనిపై చట్టాలు రూపొందించే బాధ్యత పార్లమెంటుదే అని స్పష్టం చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెల్లడించింది. స్వలింగ పెళ్లిళ్లు చేసుకునే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది.
Yogi Adityanath: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అల్వార్ లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో తాలిబాన్ ఆలోచనలను ఎలా అణిచివేయబడుతుందో మీరు చూస్తున్నారా..? ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తున్నారని ఇజ్రాయిల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లకు బజరంగ్‌బలి విధానమే పరిష్కారమని ఆయన అన్నారు.
Infosys: కరోనా మహమ్మారి ముగిసిపోవడంతో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. ఆఫీసులకు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి పలు ఐటీ సంస్థలు. ఇదిలా ఉంటే కొన్ని సంస్థలు వారానికి మూడు రోజులైన ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. హైబ్రీడ్ విధానంలో పనిచేయాలని సూచిస్తున్నాయి.
UNESCO: వరల్డ్ సిటీస్ డే రోజున దేశంలోని కోజికోడ్, గ్వాలియర్ నగరాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక యునెస్కో క్రియెటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చోటు లభించింది. 55 కొత్త నగరాల జాబితాలో ఈ రెండు నగరాలకు చోటు లభించింది. ఐక్యరాజ్యసమితి మంగళవారం ఈ జాబితాను విదుదల చేసింది. జాబితాలో భారతీయ నగరాలు చోటు సంపాదించుకోవడం గర్వకారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంస్కృతి, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో ఈ నగరాలు నిబద్ధతను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.
Iran: అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి క్రూరంగా ఊచకోత కోసింది. పిల్లలు, మహిళలనే తేడా లేకుండా చంపేసింది. ఈ దాడుల్లో 1400 మంది మరణించారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలను బందీలుగా చేసుకున్న హమాస్ తీవ్రవాదులు వారిని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో వేల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల 8 వేల మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది.