Amit Shah: కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో మతమార్పిడులకు పాల్పడుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పండరియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేద గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మతమార్పిడి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ స్కాములను వెలికితీసి, అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని జైలుకు పంపుతామని అమిత్ షా అన్నారు.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ని ‘ప్రీపెయిడ్ సీఎం’గా అభివర్ణించిన అమిత్ షా.. రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో మతమార్పిడి పెరుగుతోందని, రాజ్యాంగంలో ప్రతీ పౌరుడు కూడా తన ఇష్టానుసారం మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఇచ్చింది.. కానీ కాంగ్రెస్ పేద గిరిజనులను మతమార్పిడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారంటూ ఆరోపించారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటిలో, గ్రామంలో ఘర్షణలు చెలరేగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: BJP MP Laxman: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..
బీజేపీ ప్రభుత్వం ఎవరి మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని, అయితే ఏ ప్రభుత్వమైన మతమార్పిడులు చేస్తే దాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. సీఎం భూపేష్ బఘేల్ రాష్ట్రం డబ్బును ఢిల్లీకి తీసుకెళ్తున్నారని, రాష్ట్రాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ని నిందించారు. బఘేర్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో రెండు విడుతలుగా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి, అధికారంలోకి రావాలని బీజేపీ పోరాడుతోంది. ఛత్తీస్గఢ్ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..