Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రోజు మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటన సుకుమా జిల్లాలోని తాడ్మెట్ల, దూలెడ్ గ్రామాల మధ్య పనావర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్నికల నిర్వహణకు వెళ్లిన బీఎస్ఎఫ్ డీఆర్జీ బృందంపై నక్సలైట్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం భద్రతాసిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ ఘటన బండే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి…
Pakistan: ఇన్నాళ్లు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షితం అని భావిస్తుండే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏ ఉగ్రవాది ఎప్పుడు ఎలా కిడ్నాప్ అవుతాడో, ఎప్పుడు ఎక్కడ చనిపోయి పడుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతలా అంటే పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐకి కూడా తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి పడేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన వారు, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఖతం అవ్వడం పాకిస్తాన్‌కి మింగుడుపడటం లేదు. యథావిధిగా ఈ హత్యల వెనక శతృదేశ గూఢాచర…
Bharat Jodo Yatra 2.0: నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఊపు తీసుకువచ్చింది. మొదటిదశ సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైంది. దాదాపు 4,080 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ, యాత్ర జనవరి 2023లో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది.
ఇటీవల రాజస్థాన్ లోని అల్వార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సందీప్ దయామా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ ఎన్ని మసీదులు, గురుద్వారాలు నిర్మించారో చూడండి, ఇది భవిష్యత్తులో మనకు పుండుగా మారుతుంది.. అందుకే ఈ పుండును నిర్మూలించడం మా కర్తవ్యం’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.
Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో సహా 21 సాఫ్ట్వేర్ మరియు వెబ్సైట్లను కేంద్రం బ్లాక్ చేసింది. మహాదేవ్ యాప్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్న క్రమంలో కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. మహాదేవ్ బుక్ మరియు రెడ్డిఅన్నాప్రెస్టోప్రోతో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు మరియు వెబ్సైట్లకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది
Irfan Pathan: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరులు సామాన్య పాలస్తీనియన్లు చనిపోతున్నారు. అంతకుముందు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని ఊచకోత కోశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా తలలు కోసి చంపేశారు. ఈ దాడి తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై భీకర దాడి చేస్తోంది. హమాస్ సంస్థను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.
Women Soldiers: మహిళా సైనికులకు కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సైనికులకు, నావికులకు, వైమానిక దళాల్లో పనిచేసే మహిళలకు వారి అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ, పిల్లల దత్తత సెలవులకు కేంద్రం ఓకే చెప్పింది. సెలవులు మంజూరు చేసే ప్రతిపాదనకరు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ర్యాంకులో సంబంధం లేకుండా సాయుధ దళాల్లోని మహిళలందరిని సమానంగా చూడాలనే దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
Mahadev App case: ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్‌కి ఈ కేసు చుట్టుకుంటోంది. ఇటీవల రూ.5 కోట్లతో ఈడీకి పట్టుబడిన కొరియర్, సీఎంకి యాప్ ప్రమోటర్లు రూ. 508 కోట్లు చెల్లించారని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ కావాలనే ఇలా చేస్తుందంటూ ప్రతివిమర్శలు చేశారు.
Online Dating Scam: ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ప్రజలకు అవగాహన లేకపోవడం, అత్యాశకు పోవడం మోసాలకు కారణమవుతున్నాయి. ఇలా బ్యాంకుల్లోని డబ్బును మోసగాళ్లకు సమర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ వ్యాపారం, పేమెంట్లు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. ఇదే అదనుగా కొందరు ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఉచితాలు, బహుమతులు, తక్కువ ధర అని సామాన్యులు ఆశపడితే కూడబెట్టిన ధనం మొత్తం పోతోంది.
Arvind Kejriwal: వచ్చే ఏడాది హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చినట్లే హర్యానలో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు. హర్యానాలోని రోహ్తక్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.