Mumbai: మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం.. మహిళపై పలుమార్లు అత్యాచారం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: ఇటీవల కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా మాట్రిమోనియల్ సైటుల ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకోవడమే ఎక్కువ అవుతోంది. తమ పిల్లలకు తమ స్థాయి, హోదా కలిగిన వధువు/వరుడిని వెతికేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా మాట్రిమోనల్ సైట్లపై ఆధారపడుతున్నారు. తమకు తెలిసిన బంధువులు, చుట్టాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా గొప్పలకు పోతూ మాట్రిమోనీల ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.
అయితే ఇదే సమయంలో కొందరు మోసగాళ్లకు ఇది వరంగా మారుతోంది. పెళ్లి చేసుకుంటామని నమ్మించడమో లేకపోతే తప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసి తాము పెద్ద ఉద్యోగం చేస్తున్నామని, ఆస్తులు ఉన్నాయని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. తీరా చివరకు అమ్మాయిలు, అమ్మాయి తల్లిదండ్రులు మోసపోవడం పరిపాటిగ మారింది. పెళ్లికి ముందు ఏడు తరాల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు, కానీ సరిగ్గా అబ్బాయి గురించి తెలుసుకోలేక మోసపోతున్నారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజాగా ముంబైలో జరిగిన సంఘటన ఇదే కోవకు చెందుతుంది. నవీ ముంబైకి చెందిన 33 ఏళ్ల మహిళకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. సింగపూర్‌లో ఉన్న నిందితుడిపై సదరు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376(2)ఎన్ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
నవీ ముంబై, ముంబై, సింగపూర్‌లోని లాడ్జీలు, హోటళ్లలో డిసెంబర్ 2020 నుంచి మార్చి 2023 మధ్య పలు సందర్భాల్లో నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు మహిళకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను తీశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!