PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2023లో శనివారం ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వాటిని రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ని విమర్శించారు. గతంలో ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ సాయం కోసం ప్రపంచానికి విజ్ఞప్తి చేసేదని, ఇప్పుడు దాడుల వెన ఉన్న దేశాలు తమను రక్షించాలని కోరుతున్నాయని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు భారత్ మానసిక అవరోధాలకు గురవుతూ వచ్చింని, దీని వల్ల దేశం సాధించాల్సి అభివృద్ధి సాధించలేకపోయిందని అన్నారు. ఇప్పుడు భారత్ ప్రతీ అవరోధాన్ని బద్ధలుకొట్టి చంద్రుడిపై ఎవరూ చేరుకుని భాగంలోకి అడుగుపెట్టిందని, మొబైల్ తయారీలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉందని, స్టార్టప్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉందని ప్రధాని చెప్పారు.
Read Also: Madhya Pradesh: నాకు పెళ్లి చేస్తేనే, ఎలక్షన్ డ్యూటీకి వస్తా..
పేదరికాన్ని కేవలం నినాదాలతో ఓడించలేమని, పరిష్కారాల ద్వారా పోరాడవచ్చని ప్రధాని సూచించారు. భారత్ చాలా కాలంగా అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, దాడులు, వలసవాదం మనల్ని అడ్డంకులు కట్టడి చేశాయని, స్వాతంత్ర్యోద్యమం అనేక అడ్డంకులను బద్దలు కొట్టింది. కానీ ఆ తర్వాత ఆ ఊపును కొనసాగించలేదని, తన సామర్థ్యం మేరకు భారత్ ఎదగలేదని అన్నారు.
జన్‌ధన్ ఖాతా పథకంపై చాలా అనుమానాలు ఉండేవని, బ్యాంకులు కేవలం ధనికులకే భావించే పేద ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని ఈ పథకం నింపిందని చెప్పారు. ఏసీ గదుల్లో నివసించే వారు పేద ప్రజల మానసిక సాధికారతను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. దీని వల్ల కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, పర్యాటకం పెరిగిందని ఆయన చెప్పారు.