Pakistan: పాకిస్తాన్‌కి ఆఫ్ఘానిస్తాన్ పక్కలో బల్లెంలా తయారైంది. ముఖ్యంగా తాలిబాన్లు నేరుగా పాక్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో ఆఫ్ఘానిస్తాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్ పాలన వచ్చేందుకు పాకిస్తాన్ సహకరించింది. ఆ సమయంలో భారత్-ఆఫ్ఘన్ బంధాన్ని దెబ్బతీశామని పాకిస్తాన్ చాలా ఆనందపడింది. ఇక తాలిబాన్ నాయకులు తాము చెప్పినట్లు వింటారని అనుకుంది.
E-Air Taxis: పెరుగుతున్న కాలుష్యం, వాహనాల రద్దీ మొదలైనవి ప్రజల్ని ఇతర రవాణా వ్యవస్థ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగబోతోంది. ఇదిలా ఉంటే 2026 నాటికి ఇండియాలో ఈ-ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిలువగా ఎగిరే ఈ బుల్లి విమానాలు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులైన ఎలక్ట్రిసిటీపై ఇవి పనిచేయనున్నాయి.
North Korea: ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఓ నిగూఢ దేశం. నిజానికి ఆ దేశ ప్రజలకు బయట ఒక ప్రపంచం ఉందని తెలియదంటే అతిశయోక్తి కాదు. కేవలం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పేదే న్యాయం, చేసేదే చట్టం అక్కడ. తన తాత, తండ్రులే అక్కడ దేవుళ్లు. ఇంతలా అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. శిక్షల్లో, వింత వింత రూల్స్‌కి నార్త్ కొరియా పెట్టింది పేరు.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి అక్కడి ప్రజల్ని క్రూరంగా ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 200 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు గాజాలోకి పట్టుకెళ్లారు. హమాస్ చేసిన పని ప్రస్తుతం గాజాలోని పాలస్తీనియన్ల పాలిట నరకంగా మారింది. ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై జరిపిన దాడిలో 10,500 మందికి పైగా మరణించారు.
Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు 15 సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సమావేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘క్యాష్ ఫర్ క్వేరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ సెషన్లో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్ సిఫారసు చేసిన మహువా మోయిత్రా బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంది.
Congress: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఈ వివాదంపై ఇటు అధికార సీపీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా కోసం సంఘీభావ ర్యాలీలు చేస్తున్నాయి. ఉగ్రదాడికి గురైన ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపకపోగా పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా ర్యాలీలు ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది.
Canada: సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు సగటున 3.5 కిలోలు ఉంటుంది. 2.5 కిలోల నుంచి 4.5 కిలోల బరువును సాధారణంగా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యం ఉన్న శిశువు బరువు. కొన్ని సందర్భాల్లో పుట్టిన సమయంలో పిల్లల బరువు దీని కన్నా తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రం బాహుబలిగా జన్మిస్తుంటారు. తాజాగా కెనడాలో ఓ పిల్లాడి జననం 2010 నుంచి ఉన్న రికార్డులను తుడిపేసింది.
Qatar: గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు. దీనిపై భారత్ షాక్‌కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి భారత్ సిద్ధమైంది.
Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు టెక్ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గతేడాది నవంబర్ నుంచి మొదలైన ఉద్యోగుల తొలగింపు పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Jay Kotak: ప్రముఖ బిలియనీర్ ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ మాజీ మిస్ ఇండియా అదితి ఆర్యను వివాహం చేసుకున్నాడు. మంగళవారం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో అదితి ఆర్య యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్న సమయంలో జై ఆమెను అభినందిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా కాబోయే భార్య అదితి ఈ రోజు యేల్ యూనివర్సిటీలో తన ఎంబీఏ పూర్తి చేసింది. మీ గురించి చాలా గర్వంగా…